Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోక్‌సభ ఎన్నికలు 2019: ఈ రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్..పూర్తి సమాచారం

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజెస్‌కు చేరుకుంది. ఇప్పటికే తొలివిడత పోలింగ్ ముగియగా ఏప్రిల్ 18న రెండో విడత పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 12 రాష్ట్రాలు కేంద్రపాలిత రాష్ట్రాలు పోలింగ్‌కు వెళ్లనున్నాయి. మొత్తం 95 పార్లమెంటరీ స్థానాలకు అభ్యర్థులు పోటీలో నిలిచారు. అస్సోం, బీహార్, చత్తీస్‌గఢ్, జమ్ముకశ్మీర్, కర్నాటక, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిషా, పుదుచ్చేరి, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లలో కొన్ని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక తమిళనాడులోని 39 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. వేలూరులో ఎన్నిక రద్దుకాగా త్రిపుర తూర్పు స్థానం శాంత్రభద్రతల కారణంగా వాయిదా వేసింది ఎన్నికల సంఘం.

అస్సోంలో 5 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. కరీంగంజ్, సిల్చార్, అటానమస్ డిస్ట్రిక్ట్, మంగళడోయ్,నవగాంగ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక బీహార్‌లో ఐదు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. (కృష్ణగంజ్, కతిహార్, పూర్ణియా, భగల్‌పూర్, బంకా), మావోయిస్టు ప్రభావిత రాష్ట్రం చత్తీస్‌ఘడ్‌‌లో 3 స్థానాలు(రాజ్‌నంద్ గావ్, మహాసముంద్, కంకేర్)లకు పోలింగ్ జరగనుంది. మరో సున్నితమైన రాష్ట్రం జమ్ముకశ్మీర్‌లో రెండు స్థానాలు శ్రీనగర్, ఉదంపూర్ పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

Loksabha polls 2019:Here is the list of States that vote in second phase

దక్షిణాదిలో కర్నాటక రాష్ట్రంలోని 14 పార్లమెంట్ స్థానాలకు 18వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇందులో ఉడుపి చిక్‌మంగళూర్, హసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తూముకూరు, మాండ్య, మైసూర్, చామరాజ్‌నగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు ఉత్తరం, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు దక్షిణం, చిక్కబళ్లాపూర్, కోలార్ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇక మహారాష్ట్రలో 10 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో బుల్దానా, అకోలా, అమరావతి, హింగోలి, నాందేడ్, పర్భాని, బీడ్, ఒస్మానాబాద్, లాతూరు, సోలాపూర్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఒకే స్థానం ఇన్నర్ మణిపూర్‌ లోక్‌సభ స్థానంకు ఎన్నిక జరగనుంది.

ఇక ఒడిషాలో 5 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో బర్గర్హ్, సుందర్‌గర్హ్,బోలంగిర్, కందమాల్, అస్కా నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనుండగా... కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో ఒక స్థానంకు ఎన్నిక జరగనుంది.ఇక ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నాగిన, అమ్‌రోహా, బులంద్ షహర్, అలిఘఢ్, హత్రాస్, మథురా, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. ఇక పశ్చిమబెంగాల్‌లో మూడు నియోజకవర్గాలు జల్‌పాయిగురి, డార్జీలింగ్, రాయిగంజ్ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది.

మొత్తానికి రెండో విడత ఎన్నికల్లో తమిళనాడులోని వేలూరు నియోజవకర్గానికి పోలింగ్ రద్దు కాగా... త్రిపురా తూర్పు స్థానం శాంతిభద్రతల కారణంగా వాయిదా వేయడం జరిగింది. ఇక మిగతా అన్ని చోట్ల పోలింగ్ జరగనుంది. ఇందులో పలువురు హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. కొన్ని కొత్త ముఖాలు పార్లమెంటులో అడుగుపెట్టేందుకు తమవంతు కృషిచేస్తున్నారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+