ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తున్న ఎయిరిండియా
ఢిల్లీ : ఎయిరిండియా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణీకులకు పట్టపగలే చుక్కలు చూపించింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తెల్లవారుజామున 12.20గం. సమయంలో సర్వర్ మొరాయించడంతో ఇమ్మిగ్రేషన్ చెకింగ్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
సర్వర్ సాంకేతిక లోపం కారణంగా ఎయిరిండియా సిబ్బంది మాన్యువల్ చెకింగ్ ప్రక్రియ చేపట్టడంతో ఆ ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో ప్రయాణీకులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. కొందరు ప్యాసింజర్లు పొడవాటి క్యూలైన్లు ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఎయిరిండియాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఇదిలా ఉంటే శనివారం ఎయిరిండియా ప్యాసింజర్ సర్వీస్ సిస్టమ్ ఐదు గంటల పాటు మొరాయించడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన జరిగి రోజులు గడవకముందే మరోసారి సాంకేతిక సమస్య తలెత్తడంపై ప్యాసింజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన ఎయిర్‌పోర్టులో ఇలాంటి పరిస్థితి తలెత్తడంపై మండిపడుతున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications