హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ఫస్ట్, తెలంగాణ సెకండ్: ఏడాదిలో 300 రోజులకుపైగా అప్పులు చేస్తున్నాయి!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసేందుకు దేశంలో అనేక రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అందిస్తున్న ఉచిత పథకాలు కూడా అప్పులు పెరిగేందుకు కారణమవుతున్నాయి. కాగా, అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉండటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ(ఎస్‌డీఎఫ్), వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్(డబ్ల్యూఎంఏ), ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో అత్యధిక రోజులు అప్పు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం గమనార్హం. ఆ తర్వాతి స్థానం తెలంగాణదే.

305 రోజులపాటు ఎస్‌డీఎఫ్ వాడుకున్న ఆంధ్రప్రదేశ్

305 రోజులపాటు ఎస్‌డీఎఫ్ వాడుకున్న ఆంధ్రప్రదేశ్

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 305 రోజులపాటు స్పషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, 283 రోజులు వేస్ అండ్ మీన్స్(డబ్ల్యూఎంఏ) సంస్థ తాజాగా విడుదల చేసిన డేటా ద్వారా వెల్లడైంది. దేశంలోని మరే రాష్ట్రం కూడా ఈ విధంగా చేయలేదు. ఈ సౌకర్యాలు ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉన్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తారు.

ఆ సౌకర్యం వాడకంలో ఏపీ తర్వాత తెలంగాణనే..

ఆ సౌకర్యం వాడకంలో ఏపీ తర్వాత తెలంగాణనే..

కాగా, ఏపీ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో మణిపూర్ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 17 రాష్ట్రాలు ఎస్ డీఎఫ్, 14 రాష్ట్రాలు వేస్ అండ్ మీన్స్, 9 రాష్ట్రాలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాయి. అస్సాం, బీహార్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వీటిలో దేన్నీ ఉపయోగించుకోకపోవడం గమనార్హం. ఇక మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు కేవలం ఒక్కరోజు మాత్రమే ఎస్ డీఎఫ్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాయి.

మూడు సౌకర్యాలు వాడుకున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే టాప్

మూడు సౌకర్యాలు వాడుకున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే టాప్

ఈ రుణ సౌకర్యం ఏదో ఒకదాన్ని ఉపయోగించుకున్న మిగిలినవి ఈశాన్య, హిమాలయ ప్రాంతాల రాష్ట్రాలు. కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే మొత్తం మూడు సౌకర్యాలనూ వాడుకున్నాయి. ఆ జాబితాలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్ లో ప్రతి సంవత్సరం పెట్టే వార్షిక పెట్టుబడుల ఆధారంగా స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్పులపై రెపోరేటు కంటే 2 శాతం తక్కువగా వడ్డీ వసూలు చేస్తారు. ఇదే సౌకర్యాన్ని ప్రభుత్వ సెక్యూరిటీల ఆధారంగా వాడుకుంటే 1 శాతం మాత్రమే తక్కువ వడ్డీ ఉంటుంది.

వడ్డీతో తెలుగు రాష్ట్రాలకు నష్టమే..

వడ్డీతో తెలుగు రాష్ట్రాలకు నష్టమే..

ఎస్ డీఎప్, వేస్ అండ్ మీన్స్ సౌకర్యాలు పూర్తయిన తర్వాత కూడా ఆర్థిక అవసరాలు తీరకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటాయి. వేస్ అండ్ మీన్స్ కింద అర్హత ఉన్న మొత్తానికి సమానంగా తీసుకుంటే 2 శాతం, 100శాతానికి మించి తీసుకుంటే 5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆధారం రోజువారీ అవసరాలకు సరిపోనప్పుడు ఇవి ఆర్బీఐ వద్ద స్వల్పకాలానికి ఈ మూడింటిలో ఏదైనా ఒక సౌకర్యం ద్వారా అప్పు చేస్తుంటాయి. అయితే, ఈ సౌకర్యాలను అత్యధిక రోజులు ఉపయోగించుకున్న రాష్ట్రాలు వడ్డీ రూపంలో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయని చెప్పవచ్చు.

English summary
Long Time overdrafts through SDF and WMA: Andhra Pradesh on Top, second Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X