82 ఏళ్ళకు తీరిన కల: లేటు వయస్సులో మగబిడ్డకు తండ్రి

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: ఉత్తర కర్ణాటకలోని గుల్బర్గాలోని శవేరణ బసవేశ్వర సంస్థాన పీఠాధిపతి శరణబసప్ప 82 ఏళ్ళ వయస్సులో 9 బిడ్డకు తండ్రయ్యాడు. ఇంతకాలానికి వారసుడు వచ్చాడని ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

శవేరణ బసవేశ్వర సంస్థాన పీఠాధిపతి శరణబసప్ప మొదటి భార్యకు వరసగా ఐదుగురు కూతుళ్లు జన్మించారు. వారసుడి కోసం ఆయన రెండో పెళ్ళి చేసుకొన్నాడు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు మ‌గ‌బిడ్డ భాగ్యం క‌ల‌గ‌లేదు. రెండో భార్య ముగ్గురు ఆడ‌పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది.

 Longing for heir, Karnataka pontiff fathers 9th child at 82

శరణబసప్ప రెండో భార్య బుదవారం నాడు మగబిడ్డకు జన్మనిచ్చింది. త‌న‌కు పుట్టిన మ‌గ‌బిడ్డ‌ పుట్టాడని తెలియడంతో ఆ పీఠాధిప‌తి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
శరణబసప్పకు దాదాపు రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ మఠం అనేక విద్యాసంస్థ‌ల‌కు కూడా నడిపిస్తోంది. ఆ మఠానికి సంరక్షకుడిగా ఉండేందుకు త‌న‌కు వారసుడిగా ఈ వ‌య‌సులో మ‌గ‌బిడ్డ జ‌న్మించాడని ఆయన భావిస్తున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The pontiff of a religious mutt in the north Karnataka city of Kalaburagi has fathered a boy at the age of 82. The boy , born in a Mumbai hospital, is his ninth child.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి