వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

shabarimala అయ్యప్ప: పోలింగ్ వేళ కేరళ సీఎం అనూహ్య వ్యాఖ్యలు -ఎల్డీఎఫ్‌కే దేవుళ్ల దీవెనలన్న పినరయి

|
Google Oneindia TeluguNews

'హిందూ వ్యతిరేక కమ్మీలు' అంటూ రైట్ వింగ్ చేసే విమర్శలకు అనూహ్య కౌంటరిచ్చారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. లెఫ్ట్ ఫ్రంట్ కూటమికి నేతృత్వం వహిస్తోన్న ఆయన దాదాపు తొలిసారిగా అయ్యప్ప నామస్మరణ చేయడమేకాదు, దేవతలందరి ఆశీర్వాదంతో మరోసారి గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం కన్నూరు జిల్లాలో ఓటేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అనూహ్య వ్యాఖ్యలు చేశారాయన..

viral video: తలపతి స్ట్రాంగ్ మెసేజ్ -సైకిల్‌పై వచ్చి ఓటేసిన విజయ్‌ -ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీచార్జ్viral video: తలపతి స్ట్రాంగ్ మెసేజ్ -సైకిల్‌పై వచ్చి ఓటేసిన విజయ్‌ -ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీచార్జ్

అయ్యప్ప ఆశీర్వాదం మాకే..

అయ్యప్ప ఆశీర్వాదం మాకే..


లెఫ్ట్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్‌)తోనే కేరళ గడ్డపై దేవుళ్లు ఉన్నార‌ని, శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌స్వామి ఎల్డీఎఫ్ కూట‌మిని దీవిస్తార‌ని కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ అన్నారు. ఎల్డీఎఫ్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ప్రాముఖ్య‌త ఇచ్చింద‌ని, ప్ర‌జల‌ను త‌మ ప్ర‌భుత్వం ర‌క్షించింద‌ని, జనాన్ని కాపేడే ఏ ప్రభుత్వానికైనా దేవుళ్లందరూ అండ‌గా ఉంటార‌ని, ప్రస్తుత ఎన్నికల్లోనూ ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని సీఎం ధీమా వ్య‌క్తం చేశారు.

షాకింగ్: చిన్నమ్మను చంపేశారు -ఓటరు జాబితా నుంచి శశికళ పేరు తొలగింపు -ఈసీతో సర్కారు కుట్రన్న టీవీవీషాకింగ్: చిన్నమ్మను చంపేశారు -ఓటరు జాబితా నుంచి శశికళ పేరు తొలగింపు -ఈసీతో సర్కారు కుట్రన్న టీవీవీ

కన్నూరులో ఓటేసిన సీఎం

కన్నూరులో ఓటేసిన సీఎం

కేరళ సీఎం పినరయి విజయన్ ఇవాళ క‌న్నూరు జిల్లాలోని ధ‌ర్మ‌దం నియోజ‌క‌వ‌ర్గంలో ఓ స్కూల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎల్డీఎఫ్‌పై అయ్య‌ప్ప అగ్ర‌హం ఉంటుంద‌ని నాయ‌ర్ సంఘం నేత సుకుమార‌న్ నాయ‌ర్ ఇటీవల చేసిన కామెంట్లపై మీడియా ప్రశ్నించగా, సీఎం విజ‌య‌న్ స్పందిస్తూ.. అయ్యప్ప భక్తుడిగా నాయర్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరని, అయ్య‌ప్ప‌తో పాటు కేరళలో ఉన్న ఇత‌ర మ‌తాల దేవుళ్లు కూడా ఎల్డీఎఫ్ ప్ర‌భుత్వాన్ని దీవిస్తార‌ని అన్నారు.

దేవుళ్లు కూడా కాపాడలేరు..

దేవుళ్లు కూడా కాపాడలేరు..

ఓ వైపు పోలింగ్ జరుగుతోంటే ముఖ్యమంత్రి పినరయి విజయన్ అయ్య‌ప్ప‌స్వామి పేరును ప్ర‌స్తావించడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దేవుళ్లను తల్చుకున్నా లెఫ్ట్ పార్టీకి గెలుపు మాత్రం దక్కబోదని కాంగ్రెస్ నేత వీ ముర‌ళీధ‌ర‌న్ అన్నారు. ఎక్కడ ప్రజలంతా లెఫ్ట్ కు వ్య‌తిరేకంగా ఓటేస్తార‌న్న భ‌యంతోనే సీఎం విజ‌య‌న్ అలా మాట్లాడార‌ని మాజీ సీఎం ఉమ‌న్ చాందీ ఆరోపించారు. అలాగే..

ఎర్రన్నల నోట అయ్యప్ప పాట

ఎర్రన్నల నోట అయ్యప్ప పాట

అయ్యప్ప ఆశీర్వాదంతో లెఫ్ట్ విజయం సాధిస్తుందన్న సీఎం పినరయిపై ప్ర‌తిప‌క్ష నేత ర‌మేశ్ కూడా మండిపడ్డారు. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి అన్ని వ‌య‌సుల మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశ అనుమ‌తి క‌ల్పించే అంశంలో సుప్రీం ఇచ్చిన తీర్పును ఎల్డీఎఫ్ ప్ర‌భుత్వం స్వాగ‌తించిన తీరు ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తమైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయ్య‌ప్ప భ‌క్తుల మ‌నోభావాల‌ను ఎల్డీఎఫ్ దెబ్బ‌తీసిన‌ట్లు యూడీఎఫ్‌, ఎన్డీఏలు త‌మ ఎన్నికల ప్రచారంలో ఆరోపించాయి.

English summary
Kerala Chief Minister Pinarayi Vijayan said that Lord Ayyappa and all other gods are with the Left Democratic Front because the LDF government gave importance to people and protected them. The Chief Minister who cast his vote at the RC Amala school in Dharmadam constituency at the Kannur district of Kerala was asked to respond to a comment made by Sukumaran Nair, the chief of the Nair Service Society that Ayyappa’s anger would be upon LDF.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X