పూరీ జగన్నాథుడు ప్రధాని మోదీకి భక్తుడట..!!
Lok Sabha elections 2024 Phase 6: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీన ఆరో విడత పోలింగ్ జరుగనుంది. ఇప్పటివరకు అయిదు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ సహా మొత్తం 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 13వ తేదీన పూర్తయింది.
ఆరో విడత పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ దశలో ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 58 లోక్‌సభ స్థానాలకు 26వ తేదీన పోలింగ్ జరుగనుంది. బిహార్- 8, ఢిల్లీ- 6, హర్యానా-10, బిహార్- 5, జమ్మూ కాశ్మీర్- 1, ఒడిశా- 6, ఉత్తరప్రదేశ్- 14, పశ్చిమ బెంగాల్- 8, జార్ఖండ్-4 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ షెడ్యూల్ అయిందా రోజున.

ఆరో విడత ఎన్నికల్లో పైచేయి సాధించడానికి అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. ఎత్తులు పైఎత్తులు వేస్తోన్నాయి. ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తోన్నాయి. ఇంకో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే.. రోడ్ షోలతో హోరెత్తిస్తోన్నారు.
ఈ పరిస్థితుల మధ్య భారతీయ జనతా పార్టీని తీవ్ర ఇక్కట్లలోకి నెట్టారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు సంబిత్ పాత్రా. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్నాయి. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తోన్నప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఒడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీలో వెలిసిన జగన్నాథుడు ప్రధాని మోదీ భక్తుడంటూ సంబిత్ పాత్రా చెప్పారు. పూరీలో మోదీ నిర్వహించిన రోడ్ షో గురించి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూరీ రోడ్ షో దిగ్విజయంగా ముగిసిందని, సాక్షాత్తూ జగన్నాథుడు.. మోదీకి భక్తుడిలా మారిపోయాడని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యల కలకలం రేపాయి. బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు. జగన్నాథుడు ఒక మానవ మాత్రుడికి భక్తుడిగా అభివర్ణించడం పట్ల మండిపడ్డారు. కోట్లాదిమంది హిందువులు, ప్రపంచవ్యాప్తంగా నివసిస్తోన్న ఒడిశా ప్రజల మనోభావాలను సంబిత్ పాత్రా అవమానించారంటూ విమర్శించారు.
Mahaprabhu Shree Jagannatha is the Lord of Universe.
— Naveen Patnaik (@Naveen_Odisha) May 20, 2024
Calling Mahaprabhu a bhakt of another human being is an insult to the Lord. This has hurt the sentiments and demeaned the faith of crores of Jagannatha bhaktas and Odias across the world.
The Lord is the greatest Symbol of…
పూరీ జగన్నాథుడు- హిందువులు, హైందవం, ఒడిశా అస్తిత్వానికి ప్రతీక అని గుర్తు చేశారు. తమ రాజకీయాల కోసం భగవంతుడిని సైతం వాడుకోవడం బీజేపీ నాయకులకు కొత్తేమీ కాదని నవీన్ పట్నాయక్ ధ్వజమెత్తారు. దేవుళ్లు, మతాలను అడ్డుగా పెట్టుకుని రాజకీయాలు చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు.
I strongly condemn this statement of BJP. They have started thinking that they are above God. This is height of arrogance. Calling God bhakt of Modi ji is an insult to God. https://t.co/cOP23BpOqh
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 20, 2024
అటు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, కేరళ కాంగ్రెస్ నాయకులు కూడా సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. భగవంతుడిని సైతం మించిపోయేలా బీజేపీ నాయకులు వ్యవహరిస్తోన్నారని, దేవుళ్లను లెక్క చేయట్లేదని పేర్కొన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications