వైఫల్యాల సిద్దరామయ్య!: మల్లిఖార్జున్ ఖర్గేతో డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్!!

న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో 135 సీట్లు సాధించి ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చడం పెద్ద తలనొప్పిగానే మారిందని తెలుస్తోంది. ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడుతుండటంతో ఎవరనేది తేల్చలేని పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం మూడో రోజు కూడా విస్తృత చర్చలు జరిపింది.

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ దేశ రాజధానిలో కాంగ్రెస్ పెద్దలతో వరుస భేటీలు అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో డీకే శివకుమార్ తోపాటు సిద్ధరామయ్య మంగళవారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పదవిపై తమ ఆసక్తిని వెల్లడించారు.

 Lost 2019 LS Polls, Congress Govt Fell In 2020 Because Of Siddaramaiah: Shivakumar tells to Mallikarjun Kharge

తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని డీకే శివకుమార్.. మల్లిఖార్జున్ ఖర్గేకు స్పష్టం చేసినట్లు తెలిసింది. అంతేగాక, సిద్దరామయ్యపై పలు ఆరోపణలు చేసినట్లు సమాచారం. సిద్దరామయ్య నాయకత్వంలోనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని, అంతేగాక, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన హయాంలోనే కూలిపోయిందని ఖర్గేకు డీకే శివకుమార్ చెప్పినట్లు తెలిసింది. సిద్దరామయ్య కంటే తానే మంచి ప్రత్యామ్నాయమైన డీకే శివకుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో, కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి పేరుపై మూడవ రోజు కాంగ్రెస్ చర్చలు ఇక్కడ ముగిశాయి. అయితే, అధికారికంగా కర్ణాటక సీఎం పదవిపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.

ఆరోగ్య సమస్యల కారణంగా సోమవారం ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్న డీకే శివకుమార్ మంగళవారం ఉదయం దేశ రాజధానికి చేరుకుని సాయంత్రం ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన ఖర్గేతో భేటీ సందర్భంగా శివకుమార్ కాంగ్రెస్ అధ్యక్షుడితో తాను కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

శివకుమార్.. ఖర్గే నివాసం నుంచి వెళ్లిన కొద్దిసేపటికే సిద్ధరామయ్య అక్కడికి వెళ్లి పార్టీ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అనంతరం సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థ) కేసీ వేణుగోపాల్‌ను కూడా కలిశారు. అంతకుముందు రాహుల్ గాంధీ కూడా ఖర్గే నివాసానికి వెళ్లి 90 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి, ప్రభుత్వ ఏర్పాటు విధివిధానాలపై ఇద్దరు పార్టీ అగ్రనేతలు చర్చించారు. మరోవైపు, ప్రభుత్వాన్ని నడపాలని పార్టీ హైకమాండ్ కోరితే తాను ఆ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మరో నేత జి పరమేశ్వర అన్నారు. కాగా, తుది నిర్ణయం తీసుకునే ముందు సోనియా గాంధీతో చర్చలు జరిపే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+