వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Super sonic boom: బెంగళూరును వణికించిన వింత శబ్దం: ఉలిక్కిపడ్డ ఉద్యాననగరి: కారణాల అన్వేషణలో

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఉద్యాననగరి బెంగళూరులో కొద్దిసేపటి కిందటే ఓ వింత శబ్దం వినిపించింది. ఒకే ఒక్క సౌండ్.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే- దాదాపు సిలికాన్ సిటీ మొత్తానికీ వినిపించింది. సరిగ్గా ఈ మధ్యాహ్నం 12:22 నిమిషాలకు బూమ్ అంటూ వినిపించిన సౌండ్.. ఉలిక్కి పడేలా చేసింది. ఇది వినిపించిన వెంటనే- నెటిజన్లు తమ సోషల్ మీడియాకు పని చెప్పారు. దాని అంతు తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. సూపర్ సోనిక్ బూమ్ (Super sonic boom)గా దానికి పేరు కూడా పెట్టేశారు. హెచ్‌ఎస్ఆర్ లే అవుట్, మహదేవపుర, సిల్క్‌బోర్డ్, మడివాల, బొమ్మనహళ్లి, కొత్తనూరు, అగర, హుళిమావు, అనేకల్, పద్మానభ నగర్ వంటి పలు ప్రాంతాల్లో ఈ శబ్దం వినిపించింది.

ప్రత్యేకించి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ సమీపంలో ఈ సౌండ్ తీవ్రత అధికంగా ఉన్నట్లు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. నాలుగు వారాల వ్యవధిలో ఇలాంటి సూపర్ సోనిక్ బూమ్ వినిపించడం ఇది రెండోసారి. దీనికి గల కారణాలేమిటనేది తెలియరావట్లేదు. అధికారులెవరూ దీనిపై ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. బెంగళూరు- వైమానిక ధళ కార్యకలాపాలు అధికంగా సాగే నగరం కావడం వల్ల.. ఇలాంటి సూపర్ సోనిక్ శబ్దం వినిపించి ఉండొచ్చనే అభిప్రాయాలు సైతం నెటిజన్ల నుంచి వ్యక్తమౌతోన్నాయి.

Loud Sound In Bangalore: Netizens Worried What Is the Sound About

ఈ సౌండ్ వినిపించిన వెంటనే-నెటిజన్లు తమ ఊహలకు పదును పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తోన్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉందని అంటోన్నారు. తాము స్వయంగా ఈ శబ్దంతో ఉలిక్కిపడ్డామంటూ ఐటీ నిపుణులు ట్వీట్లు చేస్తోన్నారు. తమ ట్వీట్లకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ట్యాగ్ జోడిస్తోన్నారు. ఇలాంటి శబ్దం రావడం కొత్తేమీ కాదని, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు విస్తృతంగా సాగుతోన్నందున.. జిలెటిన్ స్టిక్స్ పేలుడు వల్ల ఇది వినిపించి ఉండొచ్చనే నెటిజన్లు కూడా లేకపోలేదు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారు? ఎలాంటి సమాధానం ఇస్తారనేది ఆసక్తిగా మారింది.

English summary
Loud Sound In Bangalore: Netizens Worried What Is the Sound About
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X