వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Loudspeaker: రాజ్ ఠాక్రే డెడ్ లైన్, మసీదుల దగ్గర హనుమాన్ చాలీసా, సౌండ్ పొల్యూషన్ ఏమిటో చూపిస్తాం !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/లక్నో: మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలని డిమాండ్ దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎక్కువ అవుతోంది. ముంబాయిలో మసీదులో లౌడ్ స్పీకర్లలో నమాజ్ చదివితే మేము అలాంటి లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని ఎంఎన్ఎస్ చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే దాయాది రాజ్ ఠాక్రే హెచ్చరించారు. ఈ రోజుతో రాజ్ ఠాక్రే ఇచ్చిన గడువు పూర్తి కావడంతో మంబాయిలో టెన్షన్ వాతావరణం నెలకొనింది. ఇప్పటికే ముంబాయిలో పలు ఏరియాల్లోని మసీదుల్లో లౌడ్ స్పీకర్లలో నమాజ్ చదవడం నిలిపివేశారని కొందరు పోలీసు అధికారులు అంటున్నారు.

Illegal affair: ప్రియుడి మోజులో ఆంటీ, ఇంట్లో భర్తకు లిక్కర్ పార్టీ ఇచ్చింది, ప్రియుడితో కలిసి ?, క్లైమాక్స్ లోIllegal affair: ప్రియుడి మోజులో ఆంటీ, ఇంట్లో భర్తకు లిక్కర్ పార్టీ ఇచ్చింది, ప్రియుడితో కలిసి ?, క్లైమాక్స్ లో

రాజ్ ఠాక్రే డెడ్ లైన్

రాజ్ ఠాక్రే డెడ్ లైన్

మే 4వ తేదీ లోపు ముంబాయిలోని మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలని, మసీదుల్లోని లౌడ్ స్పీకర్లలలో నమాజ్ (ఆజాన్) చదివితే అక్కడ లౌడ్ స్పీకర్లలో హనుమానా చాలీసా పఠిస్తామని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే హెచ్చరించారు. ఇప్పటికే ముంబాయిలోని కళ్యాణ్ ప్రాంతంలోని మసీదుల్లో లౌడ్ స్పీకర్లలో నమాజ్ చదవడం నిలిపివేశారు.

మసీదు పెద్దల సమావేశం.... లౌడ్ స్పీకర్లకు బ్రేక్

మసీదు పెద్దల సమావేశం.... లౌడ్ స్పీకర్లకు బ్రేక్

ఇప్పటికే ముంబాయిలోని పలు మసీదుల మతపెద్దలతో సమావేశాలు నిర్వహించిన పోలీసు అధికారులు మసీదులోని ఉదయం పూట లౌడ్ స్పీకర్లలో నమాజ్ చదవకూడదని మనవి చేశారు. కొన్ని మసీదుల్లో లౌడ్ స్పీకర్లలో నమాజ్ చదవడం మానేశారు. ముంబాయి నగరంలో అన్ని మసీదుల్లో లౌడ్ స్పీకర్లలో నమాజ్ చదవడం నిలిపివేయాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారు.

లౌడ్ స్పీకర్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాము

లౌడ్ స్పీకర్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాము

అయితే ముంబాయిలోని అన్ని ఏరియల్లోని మసీదుల్లో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లలో నమాజ్ చదవడం మానేయాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజే ఠాక్రే ఇప్పటికే మసీదు పెద్దలకు మనవి చేశారు. లేదంటే మసీదుల దగ్గర లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి హనుమాన్ చాలీసా పఠిస్తామని ,అప్పుడు సౌండ్ పొల్యూషన్ ఎలా ఉంటుందో మసీదు పెద్దలకు చూపిస్తామని రాజ్ ఠాక్రే హెచ్చరించారు.

రాజ్ ఠాక్రే మీద కేసులు

రాజ్ ఠాక్రే మీద కేసులు

ఇప్పటికే ఔరంగాబాద్ లో రాజ్ ఠాక్రే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయ్యింది. రెండు మతాల మద్య విధ్వేషాలు రెచ్చగోట్టే వ్యాఖ్యలు చేశారని రాజ్ ఠాక్రే మీద కేసులు నమోదు అయ్యాయి. మరోపక్క ముంబాయి సిటీ పోలీసు కమీషనర్ సంజయ్ పాండే ముంబాయి నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారని ఏఎన్ఐ మీడియా సంస్థ తెలిపింది.

రాజ్ ఠాక్రే పార్టీ బీజేపీ బీ టీమ్: శివసేన

రాజ్ ఠాక్రే పార్టీ బీజేపీ బీ టీమ్: శివసేన


ఇప్పటికే ముంబాయి పోలీసులు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేకి నోటీసులు జారీ చేశారు. మొత్తం మీద మసీదుల్లో లౌడ్ స్పీకర్లలో నమాజ్ చదవకూడదని రాజ్ ఠాక్రే ఇచ్చిన డెడ్ లైన్ పూర్తి కావడంతో ముంబాయిలో టెన్షన్ పెరిగిపోయింది. మహారాష్ట్రలో బీజేపీకి బీ టీమ్ గా ఎంఎన్ఎస్ పార్టీ నడుచుకుంటోందని మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

English summary
Loudspeaker Row: Several mosques in and near Mumbai kept loudspeakers off during azaan this morning following a threat by Raj Thackeray, chief of Maharashtra Navnirman Sena (MNS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X