Love affair: ప్రియుడిని చంపేసి చెట్టుకు వేలాడదీసిన అమ్మాయి ఫ్యామిలీ, అదే సమస్య !
బెంగళూరు/బళ్లారి: ఒకే ఊరిలో ఉంటున్న యువతి, యువకుడికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. రెండు సంవత్సరాల క్రితం ప్రేమలో పడిన యువతి, యువకుడు కలిసిమెలసి తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చెయ్యాలని ఆశపడ్డారు. కులాలు వేరుకావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. ఎలాగైన పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రేమికుల జీవితాలు తల్లకిందులైనాయి. ప్రియుడిని చంపేసిన ప్రియురాలి కుటుంబ సభ్యులు అతని శవాన్ని తోటలో ఓ చెట్టుకు వేలాడదీయడం కలకలం రేపింది.

ఒకేఊరిలో లవర్స్
కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని గంగావతి తాలుకాలోని సంగాపురలో హనుమేష్ వడ్డెర (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. హనుమేష్ నివాసం ఉంటున్న ఊరిలోనే రజని (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. ఒకే ఊరిలో ఉంటున్న రజని అనే యువతి, హనుమేష్ అనే యువకుడికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. రెండు సంవత్సరాల క్రితం హనుమేష్, రజనీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

కులాలు వేరు.... హ్యాపీగా తిరిగారు
హనుమేష్, రజనీ కలిసిమెలసి తిరుగుతూ ఎంజాయ్ చేశారు. సమయం చిక్కినప్పుడు స్నేహితుల ఇళ్లకు వెళ్లారు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో రజని ఆమె ప్రియుడు హనుమేష్ ను కలిసి ఎంజాయ్ చేసింది. ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చెయ్యాలని ఆశపడ్డారు. కులాలు వేరుకావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు.

పంచాయితీలు..... ప్రియుడికి వార్నింగ్ లు
కూతురి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న రజనీ కుటుంబ సభ్యులు పంచాయితీలు చేసి మా అమ్మాయి జోలికి రాకూడదని హనుమేష్ కు వార్నింగ్ ఇచ్చారు. ప్రియుడు హనుమేష్ కంటే రజనీది ఎక్కువ కులం కావడం, గ్రామంలో ఆమె కుటుంబ సభ్యుల ఆధిపత్యం ఎక్కువ కావడంతో హనుమేష్ అనేకరకాలుగా ఇబ్బందిపడ్డారు.

తోటలో చంపేసి చెట్టుకు శవాన్ని వేలాడదీశారు
ఊరి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని ఇటీవల హనుమేష్, రజనీ డిసైడ్ అయ్యారని సమాచారం. విషయం తెలుసుకున్న రజనీ కుటుంబ సభ్యులు హనుమేష్ ను ఓ తోటలోకి లాక్కొని వెళ్లి అతన్ని కొట్టి చంపేశారు. అదే తోటలోని చెట్టుకు హనుమేష్ శవాన్ని వేలాడదీసిన రజనీ కుటుంబ సభ్యులు చేతులు దులుపుకున్నారు.

అమ్మాయి ఫ్యామిలీ ఎస్కేప్
తన తమ్ముడిని హత్య చేశారని హనుమేష్ అన్న పరుశురామ్ గంగావతి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. విషయం తెలుసుకున్న రజనీ కుటుంబ సభ్యులు పరారైనారు. కూతురిని ప్రేమించిన హనుమేష్ ను ఆమె కుటుంబ సభ్యులు పరువు హత్య చెయ్యడం కర్ణాటకలో కలకలం రేపింది. కర్ణాటకలో ఇటీవల కాలంలో పరువు హత్యలు ఎక్కువ కావడంతో అక్కడి ప్రేమికులు ఆందోళనకు గురౌతున్నారు.












Click it and Unblock the Notifications