Marriage: లవ్ మ్యారేజ్, చెరువులో శమైన కొత్త పెళ్లి కూతురు, శవాన్ని ముట్టుకోమని భర్త ఫ్యామిలి !

బెంగళూరు/ హావేరి: ఒకే ఊరిలో ఉంటున్న యువతి, యువకుడికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. వయసులోకి వచ్చిన తరువాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకే ఊరిలో ఉన్న ప్రేమికుల కులాలు వేరు. ప్రేమికుల విషయం తెలుసుకున్న ప్రియుడి కుటుంబ సభ్యులు వాళ్లు పెళ్లి చేసుకోవడానికి వీలులేదని తేల్చి చెప్పారు. పెద్దలను పెళ్లికి ఒప్పించాలని ప్రేమికులు అనేక ప్రయత్నాలు చేశారు. ఇక లాభం లేదని డిసైడ్ అయిన ప్రేమికులు ఆరు నెలల క్రితం స్నేహితుల సహాయంతో వివాహం చేసుకున్నారు. ప్రేమికులు ప్రత్యేకంగా కాపురం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఏం జరిగిందో ఏమో తెలీదు కాను కొత్తగా పెళ్లి చేసుకున్న యువతి చెరువులో శవమై కనిపించింది. మా అమ్మాయిని ఆమె భర్త, కుటుంబ సభ్యులు చంపేసి శవాన్ని చెరువులో విసిరేశారని ఆరోపిస్తున్నారు. అమ్మాయి శవానికి అంత్యక్రియలు చెయ్యమని, తక్కువ జాతి అమ్మాయి శవాన్ని మేము ముట్టుకోమని యువకుడి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. మా కూతురిని చంపిన వాడిని మాకు అప్పగిస్తే వాడిని కూడా చంపేసి ఇద్దరి అంత్యక్రియలు ఒకేసారి చేస్తామని యువతి కుటుంబ సభ్యులు మొండికేశారు. ప్రేమ వివాహం చేసుకున్న యువతి అంత్యక్రియలు చెయ్యడానికి రెండు కుటంబాలు నిరాకరించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

 ఒకే ఊరిలో లవర్స్

ఒకే ఊరిలో లవర్స్

కర్ణాటకలోని హావేరి జిల్లాలోని బ్యాడగి తాలుకాలోని కాగినలె గ్రామంలో బసవరాజు, మనూజ అనే యువతి యువకుడు నివాసం ఉంటున్నారు. ఒకే ఊరిలో ఉంటున్న బసవరాజ్, మనూజకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. వయసులోకి వచ్చిన తరువాత మనూజ, బసవరాజ్ ప్రేమించుకున్నారు.

 కులాలు వేరు...... పెళ్లికి నో చెప్పిన పెద్దలు

కులాలు వేరు...... పెళ్లికి నో చెప్పిన పెద్దలు

ఒకే ఊరిలో ఉన్న ప్రేమికులు బసవరాజ్, మనూజల కులాలు వేరు. ప్రేమికులు బసవరాజ్, మనూజల విషయం తెలుసుకున్న ప్రియుడి కుటుంబ సభ్యులు వాళ్లు పెళ్లి చేసుకోవడానికి వీలులేదని తేల్చి చెప్పారు. పెద్దలను పెళ్లికి ఒప్పించాలని ప్రేమికులు బసవరాజ్, మనూజ అనేక ప్రయత్నాలు చేశారు.

 ఆరు నెలల క్రితం లవ్ మ్యారేజ్

ఆరు నెలల క్రితం లవ్ మ్యారేజ్

ఇక లాభం లేదని డిసైడ్ అయిన ప్రేమికులు మనూజ, బసవరాజ్ ఆరు నెలల క్రితం స్నేహితుల సహాయంతో వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రేమికులు బసవరాజ్, మనూజ ప్రత్యేకంగా కాపురం ఉంటూ ధైర్యంగా జీవితాంతం కలిసి ఉండాలని, ఎన్ని ఆంటకాలు ఎదురైనా కలిసే ఉండాలని అనుకున్నారు.

 చెరువులో శవమైన యవతి

చెరువులో శవమైన యవతి

ఇటీవల ఏం జరిగిందో ఏమో తెలీదు కాను కొత్తగా పెళ్లి చేసుకున్న మనూజ ఊరి సమీపంలోని చెరువులో శవమై కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మా అమ్మాయి మనూజను ఆమె భర్త బసవరాజ్, అతని కుటుంబ సభ్యులు చంపేసి శవాన్ని చెరువులో విసిరేశారని, ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 శవాన్ని మాత్రం ముట్టుకోమని తేల్చి చెప్పేశారు

శవాన్ని మాత్రం ముట్టుకోమని తేల్చి చెప్పేశారు

మనూజ చెరువులో శవమైన తరువాత ఆమెను ప్రేమ వివాహం చేసుకున్న బసవరాజ్ మాయం అయిపోయాడు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన బసవరాజ్ ఆచూకి మాత్రం లేదని గ్రామస్తులు అంటున్నారు. మనూజ శవానికి అంత్యక్రియలు చెయ్యమని, తక్కువ జాతి అమ్మాయి శవాన్ని మేము ముట్టుకోమని బసవరాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు, యువతి కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు తేల్చి చెప్పారు.

 వాడిని కూడా చంపేసి ఇద్దరికి ఒకేసారి అంత్యక్రియలు చేస్తాం

వాడిని కూడా చంపేసి ఇద్దరికి ఒకేసారి అంత్యక్రియలు చేస్తాం

మా కూతురు మనూజను చంపిన సవరాజ్ ను మాకు అప్పగిస్తే వాడిని కూడా చంపేసి ఇద్దరి అంత్యక్రియలు ఒకేసారి చేస్తామని మనూజ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మనూజ మాత్రం మేము కూడా అంత్యక్రియలు చెయ్యమని ఆమె కుటుంబ సభ్యులు మొండికేశారు.

 ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ?

ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ?

ప్రేమ వివాహం చేసుకున్న మనూజ అంత్యక్రియలు చెయ్యడానికి రెండు కుటంబాలు నిరాకరించడంతో పోలీసులు రంగంలోకి దిగి రాజీ చర్చలు చేస్తున్నారు. మొత్తం మీద ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుని అనుమానాస్పదంగా చనిపోయిన మనూజ అంత్యక్రియలు చెయ్యడానికి రెండు కుంటుంబాలు ముందుకు రాకపోవడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+