Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lovers: నయనా ఇంటికి రహస్య ప్రియుడు, ప్రియురాలి ఫ్రెండ్ మాయాకు తెలిసి అంతా మాయ ?

బెంగళూరు: ప్రియురాలు నయనా ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న ప్రియుడు ఆమెను కలవడానికి ఊపుకుంటూ వెళ్లిపోయాడు. నా ప్రియుడు వస్తున్నాడని, నేను రేపు ఉదయం వరకు బయటకు రానని ప్రియురాలు నయనా ఆమె స్నేహితురాలు మాయాకు చెప్పింది. కొన్ని గంటల పాటు ప్రియురాలి ఇంట్లోనే ఉండి మస్త్ మజా చెయ్యాలని ప్రియుడు స్కెచ్ వేశాడు. చీకటిలో ఎవ్వరూ చూడకుండానే ఇంట్లోకి వెళ్లిపోవాలని ప్రియుడు వెళ్లిపోయాడు. ప్రియురాలి ఇంటికి హ్యాపీగా వెలుతున్న ప్రియుడిని కొందరు చితకబాది అతని దగ్గర ఉన్న రూ. 3 లక్షల విలువైన బంగారు నక్లెస్ తో పాటు డబ్బులూ లూటీ చెయ్యడంతో అక్కడే అసలు కథ మొదలైయ్యింది.

 రహస్య ప్రేమికులు

రహస్య ప్రేమికులు

పశ్చిమ బెంగాల్ కు చెందిన సపెన్ మిథ్యా అనే యువకుడు బెంగళూరు చేరుకుని నివాసం ఉంటున్నాడు. సపెన్ మిథ్యా చిక్కపేటలోని ఓ బంగారు నగల షాప్ లో పని చేస్తున్నాడు. బెంగళూరులోని భైరవేశ్వరనగర్ లో సపెన్ మిథ్యా ప్రియురాలు నయనా నివాసం ఉంటున్నది. సపెన్ మిథ్యా, నయనా రహస్యంగా అప్పుడప్పుడు కలుసుకుంటున్నారు.

 ఇంట్లో ఒక్కటే ఉందని ఎగరేసుకుని వెళ్లాడు

ఇంట్లో ఒక్కటే ఉందని ఎగరేసుకుని వెళ్లాడు

ఫిబ్రవరి 13వ తేదీన నయనా మాత్రమే ఇంటిలో ఉంది. తన ప్రియురాలు నయనా ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుసుకున్న ప్రియుడు సపెన్ మిథ్యా ఆమెను కలవడానికి భైరవేశ్వరనగర్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అదే సమయంలో ప్రియురాలు నయనా తాను ఇంట్లోనే ఉంటానని, నా ప్రియుడు సపెన్ మిథ్యా ఇంటికి వస్తున్నాడని ఆమె స్నేహితురాలు మాయాకు చెప్పింది.

 ఓటు తెచ్చిన తంటా

ఓటు తెచ్చిన తంటా

పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల పోరు జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్ వెళ్లి ఓటు వెయ్యాలని, అంతకు ముందే తన ప్రియురాలిని రహస్యంగా కలవాలని సపెన్ మిథ్యా అనుకున్నాడు. అనుకున్నట్లే ఫిబ్రవరి 13వ తేదీన మూడు లక్షల రూపాయల విలువైన బంగారు నక్లెస్ బ్యాగ్ లో పెట్టుకుని ప్రియురాలి ఇంటికి వెళ్లి కొన్ని గంటల పాటు ఆమె ఇంటిలో ఉండి ఎంజాయ్ చెయ్యాలని ఉత్సాహంగా వెళ్లాడు.

 ప్రియుడి బెండ్ తీసి లూటీ

ప్రియుడి బెండ్ తీసి లూటీ

ప్రియురాలి ఇంటికి వెలుతున్న సపెన్ మిథ్యాను అడ్డగట్టిన ముగ్గురు యువకులు అతన్ని చితకబాదేశారు, సపెన్ మిథ్యా దగ్గర ఉన్న రూ. 3 లక్షల విలువైన బంగారు నక్లెస్, అతని దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని అక్కడి నుంచి పరారైనారు. తరువాత ప్రేమికులు సపెన్ మిథ్యా, నయనాతో పాటు ప్రియురాలు స్నేహితురాలు మాయా కూడా చంద్రలేఔట్ పోలీస్ స్టేషన్ చేరుకుని కేసు పెట్టారు.

 స్కెచ్ అదిరింది..... లవర్ ఫ్రెండ్ లవర్ కింగ్ పిన్

స్కెచ్ అదిరింది..... లవర్ ఫ్రెండ్ లవర్ కింగ్ పిన్

సీసీటీవీ కెమెరాల్లో సపెన్ మిథ్యాపై దాడి చేసి బంగారు నగలు లూటీ చేసిన వారిని పోలీసులు గుర్తించారు. ప్రియురాలు నయనా స్నేహితురాలు మాయా ప్రియుడు జాకీర్, అతని స్నేహితులు షాబాజ్ ఖాన్, ఫాజిల్ ముఖాలకు మాస్క్ లు వేసుకుని వెళ్లి మిథ్యాపై దాడి చేసి రూ. 3 లక్షల విలువైన బంగారు నగలు లూటీ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 ఆడవాళ్ల మాటల ఎఫెక్ట్

ఆడవాళ్ల మాటల ఎఫెక్ట్

తన ప్రియుడు వస్తున్నాడని నయనా స్నేహితురాలు మాయాకు చెప్పడం, నయనా ప్రియుడు వస్తున్నాడని మాయా ఆమె ప్రియుడు జాకీర్ కు చెప్పడంతో అతను స్నేహితులతో కలిసి ఈ దారి దోపిడీ స్కెచ్ వేశాడని పోలీసులు అన్నారు. కేసు పెట్టిన సమయంలో నిందితుడు జాకీర్ ప్రియురాలు మాయా నయానా వెంట పోలీస్ స్టేషన్ కు వచ్చిందని, అయితే తన ప్రియుడు జాకీర్ లూటీ స్కెచ్ వేశాడని మాయాకు తెలుసో ? తెలీదో ? అని విచారణ చేస్తున్నామని చంద్రాలేఔట్ పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+