ప్రేమికులకు గుండు గీసి, ఊరేగించారు
వారణాసి: ప్రేమించుకుని పారిపోయి పెళ్లి చేసుకున్న జంటను పట్టుకుని అతి దారుణంగా అవమానించారు. ఇద్దరికి గుండు గీసేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి సమీపంలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
వారణాసి సమీపంలోని కొయిరాజ్ పూర్ గ్రామంలో లాల్ జీ కుమార్ (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్నయువతిని లాల్ జీ కుమార్ ప్రేమించాడు. ఇద్దరి ప్రేమను పెద్దలు నిరాకరించారు.
పెళ్లి చేసుకోవడానికి వీలులేదని హెచ్చరించారు. తమ ప్రేమ విఫలం కాకూడదని భావించిన ఇద్దరు నెల క్రితం గ్రామం వదిలి పారిపోయారు. వారణాసి వెళ్లి వివాహం చేసుకుని కాపురం పెట్టారు. అప్పటి నుండి యువతి కుటుంబ సభ్యులు వీరి కోసం గాలించారు.

నాలుగు రోజుల క్రితం ఇద్దరిని పట్టుకుని గ్రామానికి తీసుకు వెళ్లారు. ఆదివారం రాత్రి ఇద్దరిని గ్రామం మద్యలో కుర్చోపెట్టి గుండు గీసేశారు. తరువాత ఇద్దరి తలలకు బోట్లు పెట్టి గ్రామం మొత్తం ఊరేగించారు. విషయం తెలుసుకున్న భార్గవాన్ పోలీస్టేషన్ సిబ్బంది కొయిరాజ్ పూర్ గ్రామానికి చేరుకున్నారు.
యువతి కుటుంబ సభ్యులతో పాటు గుండు గీసిని కొందరిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామ పంచాయితీ పెద్దలు తీర్మానించడంతో గుండు గీసేశామని అమ్మాయి కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే లాల్ జీ కుమార్ బంధువు స్యామ్ జీ ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు.
నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం (ఎంపీ) వహిస్తున్న ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం అంటున్నారు. గుండు గీసి ప్రేమికులను అవమానపరిచిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, ఇక ముందు ఇలాంటి సంఘటన జరకుండ చూడాలని లాల్ జీ కుమార్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications