Marriage: మైనర్ ను లేపుకుపోయి పెళ్లి చేసుకున్న కాలేజ్ అమ్మాయి, గర్బవతి, ఏం జరిగిందంటే ?
చెన్నై/సేలం/క్రిష్ణగిరి: ఇంటర్ పూర్తి చేసిన యువకుడు ఇటీవల కాలేజ్ లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చేరాడు. కాలేజ్ కు వెలుతున్న యువకుడికి కుటుంబ సభ్యులు బైక్ తీసిచ్చారు. నాలుగు నెలల నుంచి కాలేజ్ అబ్బాయి చక్కగా కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. ఉదయం శుభ్రంగా రెఢీ అయ్యి కాలేజ్ కు వెళ్లిన యువకుడు మాయం అయ్యాడు. రాత్రి అయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రెండు రోజులు అతని కోసం వెతికి చివరికి పోలీసు కేసు పెట్టారు. పోలీసులు యువకుడికి ఆచూకి తెలుసుకోలేని అతని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయంచారు. ఇదే సమయంలో కాలేజ్ అబ్బాయి ఉన్న ప్రాంతాన్ని పోలీసులు తెలుసుకున్నారు. తన కంటే మూడు సంవత్సరాల వయసులో పెద్దది అయిన యువతితో కాపురం పెట్టి జల్సా చేస్తున్న యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో అబ్బాయి మైనర్ అని, అతన్ని ఆ యువతి పెళ్లి చేసుకుందని తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు. యువతి మీద కిడ్నాప్, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అరెస్టు అయిన యువతి మైనర్ యువకుడితో కాపురం చేసి మూడు నెలల గర్బవతి అయ్యిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
Leader:
రివాల్వర్
తో
కాల్చుకుని
అధికార
పార్టీ
మాస్
లీడర్
ఆత్మహత్య,
ఏం
జరిగింది
?,
ఇంట్లోనే
!

డిగ్రీ కాలేజ్ లో చేరాడు
తమిళనాడులోని సేలం సమీపంలోని ఓమలూరులో 18 ఏళ్ల యువకుడు (మూడు నెలలు తక్కువ) వయసు ఉన్న యువకుడు ఇంటర్ పూర్తి చేసి ఇటీవల సేలంలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చేరాడు. కాలేజ్ కు వెలుతున్న యువకుడికి కుటుంబ సభ్యులు బైక్ తీసిచ్చారు.

మాయం అయిన కాలేజ్ అబ్బాయి
కొన్ని నెలల నుంచి గ్రామంలోని ఇంటి నుంచి ప్రతిరోజు సేలంలోని కాలేజ్ ఆ అబ్బాయి చక్కగా వెళ్లి వస్తున్నాడు.నాలుగు నెలల క్రితం ఉదయం శుభ్రంగా రెఢీ అయ్యి కాలేజ్ కు వెళ్లిన యువకుడు మాయం అయ్యాడు. రాత్రి అయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు వెతికారు.

మిస్సింగ్ కేసు.... కోర్టు ఆదేశాలు
బంధువులు, స్నేహితులు అందరికి ఫోన్లు చేసి రెండు రోజులు కాలేజ్ అబ్బాయి కోసం వెతికిన కుటుంబ సభ్యులు చివరికి కరుప్పూర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు యువకుడికి ఆచూకి తెలుసుకోలేని అతని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయంచారు. మాయం అయిన యువకుడు మైనర్ కావడంతో వెంటనే అబ్బాయి ఆచూకి తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చెయ్యడం ఆ యువకుడి కోసం పోలీసులు గాలించారు.

తమిళనాడు-కర్ణాటక బార్డర్ లో కాపురం
ఇదే సమయంలో మాయం అయిన కాలేజ్ అబ్బాయితో ఎవరు క్లోజ్ గా ఉన్నారని ఆరా తీశారు. 21 ఏళ్ల యువతితో కాలేజ్ అబ్బాయి నిత్యం టచ్ లో ఉన్నాడని, ఇద్దరూ రోజు గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతున్నారని పోలీసులకు తెలిసింది. కాలేజ్ అబ్బాయి క్రిష్ణగిరి జిల్లాలోని బేరికేలోని భారతీ నగర్ ప్రాంతం ( తమిళనాడు- కర్ణాటక సరిహద్దు)లో ఉన్నాడని పోలీసులు తెలుసుకున్నారు.

మైనర్ తో కాపురం చేస్తున్న యువతి
తన కంటే మూడు సంవత్సరాల వయసులో పెద్దది అయిన 21 యువతితో కాపురం పెట్టి జల్సా చేస్తున్న యువకుడిని సేలం పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో అబ్బాయి మైనర్ అని, అతనికి ఇంకా 18 ఏళ్ల పూర్తి కాలేదని, అతన్ని ఆ యువతి పెళ్లి చేసుకుందని తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు.

యువతి గర్బవతి, కిడ్నాప్, ఫోక్సో కేసులు
మా అబ్బాయికి 18 ఏళ్లు నిండలేదని, అతన్ని ఆ యువతి కిడ్నాప్ చేసి శారీరకంగా హింసించదని అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. యువతి మీద కిడ్నాప్, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అరెస్టు అయిన యువతి మైనర్ యువకుడితో కాపురం చేసి మూడు నెలల గర్బవతి అయ్యిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

మేము ప్రేమించుకున్నాము
అయితే తాను ఇష్ట ప్రకారమే యువతిని పెళ్లి చేసుకున్నానని ఆ యువకుడు చెబుతున్నాడని ఓ పోలీసు అధికారి అంటున్నారు. ఈ విషయంలో న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని పోలీసులు ఆలోచిస్తున్నారని తెలిసింది. మేము ప్రేమించుకున్నామని, ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకుని అద్దె ఇంటిలో కాపురం చేస్తున్నామని, అతను మైనర్ అని తనకు తెలీదని యువతి పోలీసులకు చెప్పిందని సమాచారం.