Lovers: కాలేజ్ అమ్మాయితో లవ్, ప్రియురాలి ఆత్మహత్య, కేసు పెట్టిన ఫ్యామిలీ, ఆవేదనతో ప్రియుడు !
చెన్నై/ నాగపట్నం/ మదురై: కాలేజ్ కి వెళ్లి వస్తున్న యువతితో పరిచయం చేసుకున్న యువకుడు ఆమెను ప్రేమించాడు. ఇద్దరి మనసులు ఒక్కటి కావడంతో ఇద్దరూ దగ్గర అయ్యారు. కాలేజ్ అమ్మాయితో ఆ యువకుడు ఇంతకాలం హ్యాపీగా తిరిగాడు. రానురాను ప్రేమికుల మద్య తేడాలు వచ్చాయి. కొన్ని నెలల నుంచి అమ్మాయి ఆమె ప్రియుడికి దూరం అవుతూ వచ్చింది. ప్రియుడు దూరం కావడంతో ఆ అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో కాలేజ్ అమ్మాయి ఉరి వేసుని ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తె ఆత్మహత్యకు ఆమె ప్రియుడు, కుటుంబ సభ్యులు కారణం అని అమ్మాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసు కేసు విచారణ జరుగుతున్న సమయంలో ప్రియుడు కూడా అటవి ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కాలేజ్ అమ్మాయితో ప్రేమలో పడిన యువకుడు
తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని దిగువ వేలూరు ప్రాంతంలో వినీత్ కుమార్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వినీత్ కుమార్ నివాసం ఉంటున్న ప్రాంతం సమీపంలో నివాసం ఉంటున్న శుభశ్రీ అనే యువతి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. కాలేజ్ కి వెళ్లి వస్తున్న శుభశ్రీకి, వినీత్ కుమార్ కు పరిచయం అయ్యింది. మొదట వినీత్ కుమార్ శుభశ్రీని ప్రేమించాడు.

చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ప్రేమికులు
శుభశ్రీ, వినీత్ కుమార్ ఇద్దరి మనసులు ఒక్కటి కావడంతో ఇద్దరూ ప్రేమించుకుని ఒకరికి ఒకరు దగ్గర అయ్యారు. కాలేజ్ అమ్మాయి శుభశ్రీతో ఆ యువకుడు ఇంతకాలం హ్యాపీగా తిరిగాడు. కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బతో కాలేజ్ మూసివేసినా ఇంటి దగ్గర ఉంటున్న శుభశ్రీ సమయం చిక్కినప్పుడు ఆమె ప్రియుడు వినీత్ కుమార్ కు ఫోన్ చేసి మాట్లాడింది.

తేడాలు రావడంతో దూరం అయిన ప్రేమికులు
రానురాను ప్రేమికులు శుభశ్రీ, వినీత్ కుమార్ ల మద్య తేడాలు వచ్చాయి. కొన్ని నెలల నుంచి శుభశ్రీ ఆమె ప్రియుడు వినీత్ కుమార్ కు దూరం అవుతూ వచ్చింది. ఎప్పుడు ఆలోచనలో ఉంటున్న శుభశ్రీకి ఆమె కుటుంబ సభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ప్రియుడు వినీత్ కుమార్ దూరం కావడంతో శుభశ్రీ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.

ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు
కొంతకాలంగా వినీత్ కుమార్, శుభశ్రీ ఫోన్లు కూడా చేసుకోవడం లేదని సమాచారం. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో కాలేజ్ అమ్మాయి శుభశ్రీ ఉరి వేసుకుంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శుభశ్రీ ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు. మా కుమార్తె శుభశ్రీ ఆత్మహత్యకు వినీత్ కుమార్, అతని కుటుంబ సభ్యులు కారణం అని అమ్మాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు.

ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు
పోలీసులు వినీత్ కుమార్, అతని కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేసి ఇంటికి పంపించారు. ప్రియురాలు శుభశ్రీ ఆత్మహత్య చేసుకుని తనకు జీవితాంతం దూరం అయ్యిందని వినీత్ కుమార్ ఆవేదనతో రగిలిపోయాడు. రెండురోజులుగా వినీత్ కుమార్ ఇంటి నుంచి బయటకు రాలేదు. తరువాత దిగవ వేలూరు సమీపంలోని అలవి ప్రాంతంలోకి వెళ్లిన వినీత్ కుమార్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమికులు శుభశ్రీ, వినీత్ కుమార్ మూడు రోజుల వ్యవదిలో ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అయితే ప్రేమికులు ఎందుకు దూరం అయ్యారు ? అనే విషయంలో ఇంత వరకు క్లారిటీ లేదని నాగపట్నం పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications