Lovers: ప్రియురాలి తండ్రిని కుక్కర్ తో కొట్టి చంపేసిన ప్రియుడు, నీచ్ కమీనే కుత్తే అంటావా ?, పెళ్లి !

న్యూఢిల్లీ/ లక్నో: ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడు నిర్ణయించాడు. ప్రియురాలితో కలిసి సినిమాలు, షికార్లకు తిరిగాడు. అబ్బాయి నడవడిక సక్రమంగా లేదని అమ్మాయి తండ్రికి తెలిసింది. నువ్వు నీ ప్రియుడిని మరిచిపోవాలని, మేము చెప్పిన చోట పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటావని అమ్మాయి తల్లిదండ్రులు చెప్పారు. తన పెళ్లికి ప్రియురాలి తండ్రి అడ్డుపడుతున్నాడని తెలుసుకున్న ప్రియుడు రగిలిపోయాడు. పెళ్లి సంబంధం మాట్లాడటానికి ప్రియురాలి ఇంటికి వెళ్లిన నీచ్, కమీనే, కుత్తేగాడు ఆమె తండ్రి కత్తితో కసకసా పొడిచి తల మీద కుక్కర్ కొట్టి చంపేశాడు. రైతుల ఆందోళనతో అట్టుడికి పోతున్న దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ సంఘటన జరగడం కలకలం రేపింది.

 రాజధానిలో దత్తపుత్రిక

రాజధానిలో దత్తపుత్రిక

దేశ రాజధాని ఢిల్లీలోని సోనియా విహార్ ప్రాంతంలో బిజేందర్ సింగ్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బిజేందర్ సింగ్ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు. బిజేందర్ సింగ్ పెంచుకుంటున్న మీనా (పేరుమార్చడం జరిగింది)కు ప్రస్తుతం 24 ఏళ్లు. ఢిల్లీలోని పెంపుడు తల్లిదండ్రుల దగ్గర మీనా నివాసం ఉంటూ చదువుకుంటున్నది.

 విహరించిన ప్రేమపక్షులు

విహరించిన ప్రేమపక్షులు

ఢిల్లీలో నివాసం ఉంటున్న సూరజ్ కుమార్ (25), మీనా ప్రేమించుకుంటున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న సూరజ్ కుమార్, మీనా సినిమాలు, షికార్లకు తిరిగి ఎంజాయ్ చేశారు. మీనాను పెళ్లి చేసుకోవాలని ప్రియుడు సూరజ్ కుమార్ డిసైడ్ అయ్యాడు. మా ఇంట్లో అంగీకరిస్తే తాను నిన్ను పెళ్లి చేసుకుంటానని మీనా ప్రియుడు సూరజ్ కు చెప్పింది.

 అమ్మా...వాడు నీచ్... కమీనే... కుత్తేగాడు

అమ్మా...వాడు నీచ్... కమీనే... కుత్తేగాడు

తన కుమార్తె మీనా పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతున్న సూరజ్ కుమార్ ను ప్రేమిస్తున్నదని బిజేందర్ సింగ్ కు తెలిసింది. సూరజ్ కుమార్ నీచ్.. కమీనే, కుత్తేగాడు, వాడితో నీకు ప్రేమ పెళ్లి ఏమిటి ?, మేము చూసిన చోట పెళ్లి చేసుకుంటే నువ్వు ఎలాంటి కష్టాలు పడకుండా జీవితాంతం సంతోషంగా ఉంటావని, మామాట వినాలని బిజేందర్ సింగ్ దంపతులు మీనాకు నచ్చచెప్పారు.

 రగిలిపోయిన ప్రియుడు

రగిలిపోయిన ప్రియుడు

మన పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదని, వాళ్లు ఒప్పుకుంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇటీవల మీనా ప్రియుడు సూరజ్ కుమార్ కు తేల్చి చెప్పింది. తమ దత్తపుత్రిక మీనా మళ్లీ సూరజ్ కు టచ్ లో ఉందని తెలుసుకున్న బిజేందర్ సింగ్ దంపతులు ఆమెను ఉత్తరప్రదేశ్ లోని సొంత తల్లిదండ్రుల దగ్గరకు పంపించేశారు. తన ప్రియురాలు మీనా ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లిపోవడానికి బిజేందర్ సింగ్ కారణం అని తెలుసుకున్న ప్రియుడు సూరజ్ కుమార్ రగిలిపోయాడు.

 కత్తితో పొడిచి కుక్కర్ తో కొట్టి చంపేసిన ప్రియుడు

కత్తితో పొడిచి కుక్కర్ తో కొట్టి చంపేసిన ప్రియుడు

మీనాను సూరజ్ కు ఇచ్చి పెళ్లి చెయ్యడానికి మనం అంగీకరించకూడదని ఆమె సొంత తల్లిదండ్రులు, బిజేందర్ సింగ్ మాట్లాడుకున్నారు. పెళ్లి సంబంధం మాట్లాడటానికి ప్రియుడు సూరజ్ కుమార్ ఢిల్లీలోని బిజేందర్ సింగ్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బిజేందర్ సింగ్, సూరజ్ మద్య మాటామాటా పెరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన సూరజ్ వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకుని బిజేందర్ సింగ్ ను కసకసా పొడిచేశాడు. కత్తిపోట్లు ఎక్కువ పడటంతో కిందపడిపోయిన బిజేందర్ సింగ్ తల మీద కుక్కర్ తీసుకుని దాడి చేసి చంపేసిన సూరజ్ కుమార్ అక్కడి నుంచి పరారైనాడు. బిజేందర్ సింగ్ భార్య ఫిర్యాదు చెయ్యడంతో పారిపోయి దాక్కొన్న సూరజ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి బెండ్ తీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+