జనంలేరని అలిగిన కేంద్రమంత్రి, షాకైన అధికారులు పరుగులు పెట్టారు

చెన్నై: ఓ కార్యక్రమానికి కేవలం 30 మంది మాత్రమే రావడంతో కేంద్రమంత్రి పోన్ రాధాకృష్ణన్ అలకవహించి, వేదిక పైకి వచ్చి మాట్లాడేందుకు నిరాకరించారు. తన కార్యక్రమానికి కేవలం ముప్పై మంది కూడా రాకపోవడం అతనిని తీవ్ర నిరాశకు గురి చేసింది.

చదవండి: ఉద్యోగులకు వజ్రాల వ్యాపారి దీపావళి గిఫ్ట్: 1700 మందికి కార్లు, ప్లాట్లు, 600 మందికి ఖరీదైన కార్లు

ఈ సంఘటన నాగపట్నం జిల్లాలో శుక్రవారం జరిగింది. జిల్లాలోని ఆరోగ్యకేంద్రం ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి వెళ్లారు. తీరా అక్కడ ఇరవై ముప్పై మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఆయనకు ఆగ్రహం కలిగింది. తన అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు వస్తేగానీ తాను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనని చెప్పారు.

Low turnout irks union minister Pon Radhakrishnan at social event in Tamil Nadu

ప్రజలు ఎక్కడున్నారు, కేవలం ప్రభుత్వ అధికారులే కార్యక్రమానికి వస్తే నేనేందుకు రావాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై మండిపడ్డారు. దీంతో షాకైన అధికారులు పరుగులు పెట్టి మరీ వెళ్లి ప్రజలను తీసుకు వచ్చారు. 50 మంది హాజరైన అనంతరం కార్యక్రమంలో పాల్గొని అనంతరం వేదిక ఎక్కి సభికులను ఉద్దేశించి మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+