షాక్: పెరిగిన వంటగ్యాస్ ధరలు, సబ్సిడీ సిలిండర్ ధర రూ.495.69

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ ధరను మరోసారి పెరిగాయి. సబ్సిడీ వంటగ్యాస్ ధరను రూ.4.50ను పెంచింది. దీంతో సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.495.69కు చేరింది.నాన్‌ సబ్సిడీ సిలిండర్ ధరను రూ.94లకు పెంచారు. దీంతో సబ్సిడీయేతర సిలిండర్‌ ధర రూ.742 అయింది.

సరాసరి పెట్రోలియం ధర, ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ రేట్‌ను బట్టి నెలవారీగా పెట్రోలియం మంత్రిత్వశాఖ గ్యాస్‌ ధరలను నిర్ణయిస్తోంది. ఈ మేరకు గత మే 30వ తేదీ నుంచి నెలకు రూ.4 చొప్పున 19 సార్లు పెరిగి సిలిండర్‌పై రూ.76.51 వరకు చేరుకుంది.

LPG price hike: Subsidised cylinder up by Rs 4, non-subsidised by Rs 93-94

దేశంలో సబ్సిడీ వంటగ్యాస్‌ వినియోగదారులు 18.11 కోట్ల మంది ఉన్నారు. వీరికి తోడుగా ప్రధాన్‌మంత్రి ఉజ్వల యోజన కింద ఏడాదిలో ఇచ్చిన మూడు కోట్ల సబ్సిడీ గ్యాస్‌ కనెక‌్షన్లు కూడ ఉన్నాయి. సబ్సిడీయేతర వంటగ్యాస్‌ వినియోగదారులు 2.66 కోట్ల మంది ఉన్నారు.

నిబంధనల ప్రకారం ప్రతి వినియోగదారుడు 14.2కిలోల గ్యాస్‌ సిలిండర్లను ఏడాదిలో 12వరకు సబ్సిడీపై వాడుకునే వీలుంటుంది. ఆ తర్వాత వాడుకోవాలంటే మాత్రం సబ్సిడీ వర్తించదు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ నిబంధనలు కూడా ఉండవు. వంటగ్యాస్‌కు సబ్సిడీయే ఉండదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prices of subsidised LPG cylinders on Wednesday were hiked by Rs 4.6 per cylinder, effective from the same day.A subsidised LPG cylinder of 14.2 kilograms will now cost Rs. 495.69 in Delhi, Rs 498.43 in Kolkata, Rs 498.38 in Mumbai and Rs 483.69 in Chennai, as per data available on according to the Indian Oil website.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి