ఒడిశాలో రైలు ప్రమాదం: పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్ ప్రెస్: ఆరుగురి పరిస్థితి విషమం..!
ఒడిశాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ ఈ ఉదయం కటక్ సమీపంలో పట్టాలు తప్పింది. నిర్గుండి సమీపంలో ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ 6 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు..రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది.
రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాధమికంగా అందుతున్న సమచారం మేరకు ఈ ఘనటలో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. అందులో దాదాపు 50 మందికి పైగా గాయపడినట్లు గుర్తించారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన ప్రయాణీకులను కటక్‌లోని ఆస్పత్రికి తరలించారు.

ముంబాయి నుండి భువనేశ్వర్ వెళ్తున్న ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు ఒడిశాలోని నిర్గుండి వద్ద పట్టాలు తప్పింది. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆరు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఈ రైలు ప్రమాదంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీ సీజన్ కావటం..ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడటం తో ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పటం లేదు. రైల్వే అధికారులతో పాటుగా స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సైతం సహాయక చర్చల్లో నిమగ్నమయ్యారు. అయితే, ప్రమాదం పైన రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications