Lunar eclipse 2023: రేపే చంద్రగ్రహణం.. గ్రహణ సమయంలో ఆహారంపై దర్భలను ఎందుకు ఉంచాలి?
రేపు చంద్రగ్రహణం. రేపు అరుదైన పెనుంబ్రల్ చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 44 నిమిషాలకు ప్రారంభమై ఎల్లుండి ఉదయం 1:01 నిముషాలకు ముగుస్తుంది. చంద్ర గ్రహణం కారణంగా అనేక ఆలయాలు మూసివేస్తారు. చంద్రగ్రహణం రోజు ప్రతి ఒక్కరూ కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా పండితులు చెప్తారు.
గ్రహణాలు ఏవైనా అవి మానవ జీవితంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయని, అందుకే గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై గరిక దర్భలను ఉంచాలని సూచిస్తారు. గ్రహణ సమయంలో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులను బట్టి, భూమి మీద పడే కిరణాలు మన శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి అని అందుకే గ్రహణ సమయంలో ఎవరు బయటకు వెళ్లకూడదు అని చెబుతారు.

అంతేకాదు గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై గరికను వేసుకోవాలని చెబుతారు. అలా వెయ్యకుండా గ్రహణ సమయంలో ఆహారం తింటే అనారోగ్యం వస్తుందని అంటున్నారు . అందుకే గ్రహణ సమయంలో ఆహారంపై గరిక దర్భలను వేసి గ్రహణం విడిచిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకొని, ఆ తర్వాత మాత్రమే ఆహార పదార్థాలను ఉపయోగించుకోవాలని చెబుతారు.
గ్రహణ సమయంలో ఆహార పదార్థాలలో గరికను ఎందుకు వేస్తారు? దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అంటే గ్రహణ సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన కిరణాలు ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంటుంది. ఇక ఈ కిరణాలు పడినటువంటి ఆహారపదార్ధాలు తీసుకుంటే అనారోగ్యం సంభవిస్తుంది. అందుకే ఈ సమయంలో పని చేయకూడదని, ఆహారపదార్థాలు ముట్టుకోకూడదని చెబుతారు.
ఇక ఆహార పదార్థాలపై దర్భలను వేయడంలో కూడా తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఉంది. ఆహార పదార్థాలలో దర్భలను వేయడం వల్ల గ్రహణ ప్రభావం వల్ల వచ్చే కిరణాల ప్రభావాన్ని పచ్చని గరిక దర్భలు లాక్కుంటాయి. దర్భలు అతినీలలోహిత కిరణాలను తమ లోనికి తీసుకొని, వాటి ప్రభావం ఆహారంపై పడకుండా కాపాడతాయి. కాబట్టే గ్రహణ సమయంలో కచ్చితంగా ఆహార పదార్థాలపై, పచ్చళ్ళ పై దర్భలను ఉంచాలని చెబుతారు.












Click it and Unblock the Notifications