బస్సులో మంటలు: 7గురు సహజీవ దహనం

ఆ బస్సు బెంగళూర్ నుంచి ముంబై వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. బస్చు డివైడర్‌ను ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకులో మంటలు పుట్టాయి. ఈ ప్రమాదం గురువారం తెల్లవారు జామును 3 గంటల ప్రాంతంలో జరిగింది.
ప్రమాదానికి గురైనప్పుడు బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు. ముగ్గురు ఉద్యోగులున్నారు. ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్, క్లీనర్ తప్పించుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సు గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు తెలలుస్తోంది.
ప్రమాదంలో గాయపడినవారిలో కొంత మందిని హవేరీలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కొంత మందిని హుబ్లీలోని కర్ణాటక వైద్య విజ్ఞాన సంస్థ (కిమ్స్) ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదానికి గురైందని తెలిసిన వెంటనే ప్రయాణికులు అద్దాలు పగులగొట్టుకుని బయటకు దూకారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications