సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా.. : పినరయికి ఆ మినహాయింపు
MA Baby: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా.. ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన కొత్త పొలిట్ బ్యురోను సీపీఎం జాతీయ నాయకత్వం ఎన్నుకుంది. ఇందులో ఎనిమిది కొత్త ముఖాలకు చోటు లభించింది. కేరళ ముఖ్యమంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్‌కు పార్టీ పదవులు చేపట్టడానికి 75 సంవత్సరాల వయోపరిమితి నుండి మినహాయింపు లభించింది.
తమిళనాడులోని మధురైలో సీపీఎం జాతీయ మహాసభలు నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుందా కమ్యూనిస్ట్ దిగ్గజ పార్టీ. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీని నియమించింది. బేబీ పూర్తి పేరు- మరియం అలెగ్జాండర్ బేబీ. ఆయన స్వరాష్ట్రం కేరళ.

కొల్లంలో 1954 ఏప్రిల్ 5వ తేదీన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పీఎం అలెగ్జాండర్, లిల్లీ అలెగ్జాండర్. ప్రాక్కులంలోని ఎన్ఎస్ఎస్ హైస్కూల్‌లో చదువుకున్నారు. ఆ సమయంలోనే రాజకీయాలపై ఆసక్తిని ఏర్పడింది. వామపక్ష భావజాలానికి ఆకర్షితులయ్యారు. కేరళ కమ్యూనిస్టు సీనియర్ నేతల ప్రోత్సాహంతో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన మంచి రచయిత కూడా.
కొల్లంలోని ఎస్ఎన్ కళాశాలలో ప్రీడిగ్రీ విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చదివారు. విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంఘాల్లో కీలక సభ్యుడిగా ఎదిగారు. ఆయన రాజకీయ జీవితాన్ని మలచడంలో విద్యార్థి, యువజన ఉద్యమాల్లో భాగస్వామ్యం.. ముఖ్య పాత్రను పోషించింది.

ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ.. రెండింటికీ అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేశారు ఎంఏ బేబీ. అనంతరం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1986 నుండి 1998 వరకు రాజ్యసభకు ప్రాతినిథ్యాన్ని వహించారు. 2006 నుండి 2016 వరకు కొల్లంలోని కుందర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
2006 నుండి 2011 వరకు కేరళ మంత్రివర్గంలో ప్రాథమిక విద్య, సాంస్కృతిక శాఖ మంత్రిగా పని చేశారు. 2012లో పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కొల్లం నియోజకవర్గం నుండి పోటీ చేశారు గానీ గెలవలేదు. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి ఎన్‌కే ప్రేమ్ చంద్రన్ చేతిలో ఓడిపోయారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications