మధ్యప్రదేశ్ లో హోరాహోరీ- బీజేపీకి పోటీగా కాంగ్రెస్ 50 శాతం కమిషన్ పోస్టర్ల విడుదల..
మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలో పరస్పరం కేసులు పెట్టుకోవడం, విమర్శలు గుప్పించుకోవడం, మైండ్ గేమ్ నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ 50 శాతం కమిషన్ అంటూ పోస్టర్లు విడుదల చేసి కలకలం రేపింది.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో విజయవంతమైన అవినీతి ఫార్ములాను మధ్యప్రదేశ్ లోన అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ శుక్రవారం పూర్తిస్థాయి దాడి ప్రారంభించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ యూనిట్ 50 శాతం కమీషన్ పేరుతో అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించింది.

మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్, పార్టీ కార్యకర్తలతో కలిసి ఘోటాలా హి ఘోటాలా- ఘోటాలా సేథ్, 50% కమీషన్ రేటు ( అవినీతి పుష్కలంగా ఉంది, అవినీతి సార్ ర్ రేటు 50 శాతం) అని రాసి ఉన్న పోస్టర్‌లను ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలోని రైతులు, యువత, వ్యాపారవేత్తల్ని మోసం చేశారని, అవినీతికి బలికాని లేదా అవినీతిని చూడని ఒక్క వ్యక్తి కూడా రాష్ట్రంలో లేరని కమల్‌నాథ్ ఆరోపించారు.
ప్రభుత్వ పనులలో 50% కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపిస్తూ తాజాగా రాష్ట్రంలోని రేవాకు చెందిన గౌషాల పేటి కాంట్రాక్టర్ సంఘం మధ్యప్రదేశ్ హైకోర్టు, జబల్‌పూర్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. కాంట్రాక్టర్లు ఈ ప్రకటనను బహిరంగంగా విడుదల చేశారు. తమలాంటి చాలా మంది 50% కమీషన్ పాలనతో బాధపడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి తీవ్రమైన విషయాలలో సుమోటోగా వ్యవహరించే సంప్రదాయం భారత న్యాయవ్యవస్థకు ఉందని కమల్ నాథ్ తెలిపారు. . ఈ కాంట్రాక్టర్ లేఖను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టును ఆయన అభ్యర్ధించారు.












Click it and Unblock the Notifications