మధ్యప్రదేశ్ ఎన్నికలు: 53 మంది రెబెల్స్‌పై ఆరేళ్ల పాటు బీజేపీ వేటు
Recommended Video

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పలువురు నేతలకు గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా 53 మంది రెబల్ అభ్యర్థులను ఆరేళ్ళ పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో మాజీ మంత్రులు రామకృష్ణ కుస్మారియా, కేఎల్ అగర్వాల్, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్ వంటి నేతలు ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థులు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పలువురు స్వతంత్రులుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొంతమంది ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లి.. పార్టీ అభ్యర్థి పైనే పోటీ చేస్తున్నారు.

బీజేపీ నేతలు చాలామంది రెబల్‌గా పోటీ చేస్తున్నారు. వారిని బుజ్జగించినా వినలేదు. దీంతో ఏకంగా 53 నేతలపై అధిష్టానం వేటు వేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా పలువురిపై కఠిన చర్యలు తీసుకుంది.
దాదాపు 30 స్థానాల్లో రెబల్స్ ప్రభావాన్ని చూపనున్నారని భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి 90 మంది తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి 60 మంది స్వతంత్రులుగా బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు వీరిలో చాలామందిని బుజ్జగించేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ పరిస్థితిలో మార్పు లేదు. దీంతో వేటు వేస్తున్నారు. తిరుగుబాటుదారులు తమకు గండికొడతారని అభ్యర్థులు ఆందోళనతో ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లో నామినేషన్ ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. చాలామంది నేతలు తగ్గలేదు. దీంతో గురువారం బీజేపీ 53 మందిపై వేటు వేసింది. మధ్యప్రదేశ్‌లో 230 నియోజకవర్గాలకు గాను 2932 నామినేషన్లు దాఖలయ్యాయి. 578 తిరస్కరణకు గురికాగా, 538 మంది ఉపసంహరించుకున్నారు.
బీజేపీ వేటు వేసిన వారిలో మాజీ మంత్రులు రామకృష్ణ కుస్మారియా, కేఎల్ అగర్వాల్, గ్వాలియర్ మాజీ మేయర్ సమీక్షా గుప్తా, ఎమ్మెల్యేలు రాజ్ కుమార్, నరేంద్ర సింగ్ కుష్వాహా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వేటు పడిన వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications