వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Madhya Pradesh Floor Test: సీఎం పదవికి కమల్ నాథ్ రాజీనామా, ‘అంతా బీజేపీ కుట్రే’

|
Google Oneindia TeluguNews

భోపాల్: రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన అందించానని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం 5గంటలలోగా బలనిరూపణ పరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కొత్త రూపు ఇవ్వడానికి ప్రయత్నించానని అన్నారు.

బీజేపీ 15ఏళ్లలో చేసింది.. మేం 15 నెలల్లోనే..

బీజేపీ 15ఏళ్లలో చేసింది.. మేం 15 నెలల్లోనే..

బీజేపీ ప్రభుత్వం 15 ఏళ్లలో చేసింది తాను 15 నెలల కాలంలోనే చేశానని కమల్ నాథ్ చెప్పుకొచ్చారు. ఐదేళ్ల పాలన కోసం ప్రజలు తమకు ఓటు వేశారని చెప్పారు. అయితే, బీజేపీ మాత్రం తమ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రజా తీర్పును బీజేపీ అపహాస్యం చేసిందని అన్నారు.

మా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్రలు

మా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్రలు

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కర్ణాటకలో బంధించిందని కమల్ నాథ్ ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై బీజేపీ కుట్రలు చేసే కూలదోసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రజలు కోరుకున్నదానికి విరుద్ధమని అన్నారు.

సీఎం పదవికి కమల్ నాథ్ రాజీనామా..

సీఎం పదవికి కమల్ నాథ్ రాజీనామా..


కాగా, 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం, వారిలో 16 మంది రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీంతో బలనిరూపణకు ముందే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. కాగా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కమల్ నాథ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో డిగ్గీతో చర్చించిన కమల్ నాథ్.. కాసేపట్లో గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేయనున్నారు. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తమకు తగిన బలం లేదని ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.

Recommended Video

MP Political Crisis: Speaker adjourns House without floor test | బలపరీక్ష ను అడ్డుకున్న కరోనా వైరస్
బీజేపీకి లైన్ క్లియర్ అయినట్లే?

బీజేపీకి లైన్ క్లియర్ అయినట్లే?


కాంగ్రెస్ పార్టీలో కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు మద్దతు పలుకుతూ 22 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరంతా సింధియా వెంటే ఉన్నారు. దీంతో బీజేపీకి 107 స్థానాలుండగా, కాంగ్రెస్ పార్టీకి 92 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇక రాష్ట్రంలోని ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీకే మద్దతు పలకడం గమనార్హం. దీంతో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

English summary
Madhya Pradesh Floor Test: Kamal Nath Resigns As CM, blames bjp
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X