ఆదివారం నీ ఇష్టమయ్యా..! వారంలో ఒక్కో భార్యతో 3 రోజులుండు.!. కోర్టు కౌన్సెలింగ్!

ఇద్దరు భార్యలు ఒకే భర్త విషయంలో గొడవ పడగా.. ఏ భార్యకు ఇబ్బంది కలగకుండా భర్తను సమానంగా విభజించింది మధ్యప్రదేశ్‌లోని ఓ ఫ్యామిలీ కోర్టు.

ఇద్దరు భార్యలు ఒకే భర్త విషయంలో గొడవ పడ్డారు. దీంతో ఏ భార్యకు ఇబ్బంది కలగకుండా భర్తను మధ్యప్రదేశ్‌లోని ఓ ఫ్యామిలీ కోర్టు సమానంగా విభజించింది. 3 రోజులు ఒక భార్య దగ్గర ఉండు.. మరో భార్య దగ్గర 3 రోజులుండు.. ఆదివారం నీ ఇష్టం అంటూ భర్త ఇష్టానికి వదిలేసింది. ఇద్దరు భార్యలతో భర్త కోరిక మేరకు ఎక్కడైనా ఉండవచ్చనే ఒప్పందాన్ని కుదిర్చింది.

గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం హర్యానాలోని మల్టీనేషనల్‌ కంపెనీలో ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి 2018లో గ్వాలియర్‌ ప్రాంతానికి చెందిన మహిళతో వివాహం కాగా, 2020లో కరోనా కారణంగా భారత్‌లో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో ఆ వ్యక్తి తన భార్యను పుట్టింటికి పంపించాడు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా అతను తన భార్యను తీసుకువెళ్లలేదు. హర్యానాలో ఉద్యోగం చేసే ప్రాంతానికి వెళ్లిపోయాడు.

madhya pradesh, gwalior, family court, 2nd marriage issue

తర్వాత అతను అదే కంపెనీలో పని చేస్తున్న మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. భర్త వచ్చి తనని తీసుకెళ్తాడని ఎదురుచూసిన మొదటి భార్య ఓపిక నశించి.. పుట్టింటి నుంచి హర్యానాలో భర్త పనిచేస్తున్న కార్యాలయానికి వచ్చింది. అక్కడే తన భర్త రెండో వివాహం చేసుకున్నాడని, ఆమె అదే కార్యాలయంలో చేస్తుందనే విషయం తెలిసింది. దీంతో ఆమె పుట్టింటికి ఫోన్ చేసి తెలిసిన లాయరుద్వారా గ్వాలియర్ లోని ఫ్యామిలీకోర్టులో న్యాయం చేయాలంటూ పిటిషన్ వేసింది.
6 నెలలపాటు ముగ్గురికీ కోర్టు కౌన్సెలింగ్ ఇచ్చింది. ఇటువంటి ప్రతిపాదన పెడదామనే ఆలోచనే లేదని, కానీ 6 నెలలకు కూడా కేసు తెగేటట్లు కనపడకపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భర్త, ఇద్దరు భార్యలతో చర్చలు జరిపిన కౌన్సిలర్ హరీష్ దివాన్ తెలిపారు. ఆయనే వారి మధ్య సయోధ్యను కుదిర్చారు. హరీష్ ప్రతిపాదనకు ఇద్దరు భార్యలతోపాటు భర్త కూడా ఒప్పుకున్నాడు. దీంతో ఈ తీర్పు తర్వాత ఆ భర్త తన భార్యలిద్దరికీ చెరో ఫ్లాట్ కొనిచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+