తల్లికి అనారోగ్యమని నమ్మించి కూతురిని హత్య చేసిన తండ్రి, ఎందుకంటే?
భోపాల్:కులాంతర వివాహం చేసుకొన్న తన కూతురును ఓ తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖేతియాలో గురువారం నాడు చోటు చేసుకొంది. కూతురును చంపిన తర్వాత నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మధ్యప్రదేశ్‌లోని ఖేతియాకు చెందిన సర్లా మాలి (24) అనే యువతిని పక్క గ్రామానికి చెందిన పంకజ్ అనే యువకుడు ప్రేమించాడు. అయితే పంకజ్‌ది వేరే కులం. వేరే కులం కావడంతో పంకజ్‌తో వివాహానికి సర్లా మాలి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.

దాంతో సర్లా ఇంటి నుంచి వెళ్లిపోయి పంకజ్‌ను వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత పంకజ్ గ్రామంలోనే దంపతులు నివాసం ఉంటున్నారు. దీంతో సర్లా మాలి కుటుంబసభ్యులకు నచ్చలేదు. వేరే కులానికి చెందిన పంకజ్ ను పెళ్ళి చేసుకొని తమ కుటుంబం పరువును తీసిందని కూతురిని చంపాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు.
పథకం ప్రకారంగా సర్లా మాలి కుటుంబసభ్యులు ఆమె వద్దకు వచ్చి తల్లిక ఆరోగ్యం బాగాలేదని నమ్మించి తమ ఇంటికి తీసుకొచ్చారు. తమ పరువును తీసిందనే అక్కసుతో సర్లా మాలిని కత్తితో నరికి చంపారు. ఈ ఘటనకు సంబంధించి సర్లా మాలి తండ్రి దేవిదాస్ కోలిని పోలీసులు అరెస్ట్ చేశారు. సర్లా మాలి తల్లి తుల్సీబాయి, సోదరుడు హీరాలాల్ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications