దారుణం: పెద్దయ్యాక పెళ్లి చేసుకోరని, అప్పుడే పుట్టిన చిన్నారి అదనపు వేళ్లను కోసేసిన తల్లి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఖాండ్వా జిల్లాలో ఓ గిరిజన గ్రామంలోని మహిళ అప్పుడే పుట్టిన తన చిన్నారి వేలికి, కాలికి ఎక్కువ చేతులు ఉండటం గమనించి, వాటిని తొలగించింది. దీంతో ఆ చిన్నారి చనిపోయింది.
ఆ మహిళ ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పాప చేతులు, కాళ్లకు అదనపు వేళ్లు ఉండటంతో, అలా ఉంటే ఆమెను పెద్దయ్యాక ఎవరూ పెళ్లి చేసుకోరని భయపడి, అదనపు వేళ్లను కోసేసింది. కొడవలితో ఈ ఘోరానికి పాల్పడింది. ఆ తర్వాత ఆ పాప మృతి చెందింది.

విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. దర్యాఫ్తు జరిపారు. ఆ పసిపాప డిసెంబర్ 22న పుట్టిందని, ఆమె చేతులు, కాళ్లకు ఆరేసి చొప్పున వేళ్లు ఉన్నాయని, దీంతో ఆ శిశువు తల్లి అదనపు వేళ్లను కోసేసి, గాయాలకు పేడ రాసిందని, అయితే, కొన్ని గంటలకే ఆ శిశువు మృతి చెందిందని, అదనపు వేళ్లు ఉంటే పెళ్లి కాదనే మూఢనమ్మకంతో ఆమె ఈ చర్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.
ఆ పసిపాపకు వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కేసులో తల్లిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు. ఆ గ్రామంలో ప్రసూతి వైద్య సేవలు అందిస్తున్న స్థానిక వైద్య సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి తెలిపారు. శిశువు జన్మించిన అనంతరం పాటించాల్సిన ప్రక్రియలను, జాగ్రత్తలను వైద్య సిబ్బంది కూడా విస్మరించారన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications