Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Madhya Pradesh Polls 2023: బీజేపీ-కాంగ్రెస్ హోరాహోరీ ! ఏ కులాలు ఎవరివైపు ?

మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 17న జరిగే ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత ఉన్నా, సమస్యలు ఉన్నా వాటి కంటే కులాల పోరు ఈ ఎన్నికల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏయే కులాలు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నాయన్నది తాజాగా వెలువడుతున్న ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.

తాజాగా వెలువడిన ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలోని బ్రాహ్మణ, కిరార్-ధకడ్, జాతవ్-సత్నామీ, కుర్మీ, యాదవ్, బనియా, రాజ్‌పుత్‌ల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం రాష్ట్రంలో ముస్లింలు, భీల్ కమ్యూనిటీకి కాంగ్రెస్ పార్టీ మొదటి ఎంపిక అవుతుందని భావిస్తున్నారు. దీంతో ఆయా కులాల జనాభా ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశముంది.

Madhya Pradesh Polls 2023: which caste is with bjp and with congress?

ఈ సర్వేకు ముందు వెలువడిన ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని తేలిపోయింది. ఇందులో మధ్యప్రదేశ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ 0.1 శాతం మాత్రమే ఆధిక్యంలో ఉంది. 230 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 113-125 సీట్లు రావచ్చని, బీజేపీకి 104-116 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఏబీపీ సర్వేలో తేలింది.

ఈ రెండు సర్వేల్ని బట్టి చూస్తే రాష్ట్రంలోని 80 శాతం బ్రాహ్మణ ఓటర్లు బీజేపీని ఎన్నుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్ కు కేవలం 12 శాతం ఓట్లను మాత్రమే లభిస్తాయని తేలింది. అలాగే 68 శాతం బనియా ఓటర్లు బీజేపీకి, 14 శాతం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. 72 శాతం రాజ్‌పుత్‌లు బీజేపీకి, 12 శాతం మంది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవచ్చని తెలుస్తోంది. కుర్మీ ఓటర్లలో దాదాపు 54 శాతం మంది బిజెపికి, 41 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటేయబోతున్నారు.యాదవ ఓటర్లలో 47 శాతం మంది బీజేపీకి ఓటు వేయవచ్చని,35 శాతం కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు.

56శాతం OBC ఓటర్లు బీజేపీకి, 32 శాతం మంది కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయి. 84 శాతం కిరార్-ధకడ్ కమ్యూనిటీ ప్రజలు బీజేపీకి, 15 శాతం మాత్రం కాంగ్రెస్ కు ఓటేయవచ్చు. 54 శాతం భీల్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి,35 శాతం మంది బీజేపీకి మద్దతుగా ఉన్నారు. జాతవ్-సత్నామి ఓట్లలో 45 శాతం బీజేపీకి, 42 శాతం కాంగ్రెస్ కు మద్దతిచ్చే అవకాశం ఉంది.ఇతర దళితుల్లో బీజేపీకి 44 శాతం, కాంగ్రెస్ కు 40 శాతం లభించే అవకాశముంది. ముస్లింలలో 87 శాతం కాంగ్రెస్ పార్టీకి, కేవలం 2 శాతం మాత్రం బీజేపీకి మద్దతిస్తారని తేలింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+