Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మధ్యప్రదేశ్ లో ఇండియా కూటమి పొత్తు విఫలం-ఎస్పీ స్ధానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల పోటీతో..!

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఇండియా కూటమి త్వరలో మధ్యప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్ధానాల విషయంలో ఇరు పార్టీల మధ్య సాగిన చర్చలు విఫలం కావడంతో పరస్పరం అభ్యర్ధుల్ని పోటీకి దింపుకుంటున్నాయి. దీంతో ఈ అవకాశాన్ని వాడుకుని పైచేయి సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

మధ్యప్రదేశ్‌లో ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తుపై ఇప్పటివరకూ ఉన్న ఆశలు కాస్తా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనతో ఆవిరయ్యాయి. మధ్యప్రదేశ్‌లో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల మొదటి జాబితాలో ఎస్పీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ఏడు స్థానాల్లో నాలుగు స్థానాలకు పేర్లు ఉన్నాయి. దీంతో ఎస్పీ స్ధానాల్లో కాంగ్రెస్ అభ్యర్దుల ప్రకటన ఇండియా కూటమిలో చిచ్చుకు కారణమవుతోంది.

Madhya Pradesh Polls: INDIA alliance fails as congress announced candidates in sp finalised seats

అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ.. తన ఇండియా కూటమి భాగస్వామికి తీవ్ర హెచ్చరికలు పంపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మరో తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన నాలుగు స్థానాల్లో చిత్రాంగి, మెహగావ్, భందర్ , రాజ్‌నగర్ ఉన్నాయి. 2018లో ఎస్పీ గెలిచిన ఛతర్‌పూర్‌లోని బిజావర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టడంతో సమాజ్‌వాదీ పార్టీ అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది.

అదే సమయంలో ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు రామాయణ్ సింగ్ కూడా కాంగ్రెస్ తో పొత్తు అవకాశాలకు తెరపడినట్లేనని ప్రకటించారు. తాము కాంగ్రెస్ నాయకత్వంతో కొంత మేరకు చర్చలు జరిపామని, కానీ వాటికి ఆదివారంతో తెరపడిందన్నారు. తాము సొంతంగా కొన్ని సీట్లలో పోటీ చేస్తామని, వచ్చే ఏడాది ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+