చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిల్లాడి బుగ్గ గిల్లిన టీచర్‌కు రూ.50వేల భారీ జరిమానా

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై/ముంబై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ పాఠశాలలో పిల్లాడి బుగ్గ గిల్లినందుకు ఓ టీచర్ రూ.50వేల మూల్యం చెల్లించవలసి వచ్చింది. విద్యార్థి బుగ్గ గిల్లినందుకు టీచర్‌కు మద్రాసు హైకోర్టు ఈ భారీ జరిమానా విధించింది. 2012లో కేసరి హయ్యర్ సెకండరీ పాఠశాల టీచర్ మెహరున్నీసా ఓ విద్యార్థిని దండించే క్రమంలో బుగ్గ గిల్లింది.

దాంతో, ఆ విద్యార్థి తల్లి ఈ ఘటనను స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళింది. 2013లో కమిషన్ దీనిపై విచారణ జరిపి నిబంధనలు అతిక్రమించిందంటూ పాఠశాలకు రూ.1000 జరిమానా విధించింది. అదే సమయంలో విద్యార్థి తల్లి పాఠశాలను టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్) కావాలని కోరింది. బాలుడికి టీసీ ఇవ్వడంలో స్కూలు వారు జాప్యం చేశారు.

బుగ్గగిల్లిన ఘటనలో సరైన న్యాయం జరగలేదన్న ఆవేదన, టీసీ ఇవ్వడంలో పాఠశాల వైఖరి పైన విద్యార్థి తల్లిని హైకోర్టుకు వెళ్లారు. అంతేకాకుండా సైదాపేట మేజిస్ట్రేట్ న్యాయస్థానంలోనూ ఆమె ప్రయివేటు కేసు దాఖలు చేశారు.

Madras HC fines school teacher Rs 50,000 for pinching student’s cheek

మరోవైపు, తనను పలు రకాలుగా వేధిస్తున్నారంటూ టీచర్ మెహరున్నీసా కూడా హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ కేసు కింది కోర్టులో పెండింగ్‌లో ఉందని, అక్కడకు వెళ్ళాలని సూచించింది. ఆమెపై వచ్చి ఆరోపణలన్నింటిపైనా రూ.50000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో ఓ పబ్లిక్ టాయిలెట్లో పేలుడు సంభవించడంతో బాలుడు దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. లోకమాన్య నగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

సెప్టిక్ ట్యాంకులో ఉత్పత్తి అయిన వాయువులు అధిక పీడనం వద్ద బయటకు వెలువడి ఉంటాయని, అందుకే టాయిలెట్ పేలిపోయి ఉంటుందంటున్నారు. టాయిలెట్ సీటు సరిగ్గా సెప్టిక్ ట్యాంక్ పైనే ఏర్పాటు చేశారని మున్సిపల్ కార్పొరేషన్ రీజనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ సంతోష్ కదమ్ తెలిపారు. మరణించిన బాలుడిని గుర్తించారు.

English summary
The Madras high court has imposed a fine of Rs 50,000 for pinching her student’s cheek as a punishment. The order was issued by the first bench of HC comprising Chief Justice Sanjay Kishan Kaul and Justice M Sathyanarayanan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X