LG కిరణ్ బేడీకి కోర్టులో చుక్కెదురు, ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చిచెప్పిన హైకోర్టు
Recommended Video
పుదుచ్చేరీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అధికారాలకు చెక్ పెట్టింది మద్రాస్ హై కోర్టు. లెప్టినెంట్ గవర్నర్ రోజువారి ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుడదని రూలింగ్ ఇచ్చింది. కాగా కిరణ్ బేడీ లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అధికార వ్యవహరాల్లో జోక్యం చేసుకుంటుందనే ఆరోపణలు ఎదుర్కోంటుంది.

రోజువారి కార్యకలాపాల్లో ఎల్జీ జోక్యం చేసుకోకుడదు , మద్రాస్ కోర్టు రూలింగ్
కిరణ్ బేడీ 2016 లో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సీఎం నారయణ స్వామీ , లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మధ్య అధికార వ్యవహారాల పై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా కిరణ్ బేడీ అధికార యంత్రాంగం కార్యకలపాల్లో జోక్యం చేసుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మినారయణ గవర్నర్ రోజువారి విధుల్లో జోక్యం చేసుకోవడంపై 2017 లో వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

గవర్నర్ , ముఖ్యమంత్రి ల మధ్య అధికార వివాదం
గవర్నర్, సీఎంల మధ్య అధికార విభజనలో వివాదం నేపథ్యంలోనే గవర్నర్ ప్రభుత్వ పాలసీల్లో జోక్యం చేసుకోవడంపై సిఎం నారయణ స్వామి గతంలో ఆరురోజుల పాటు నిరసన సైతం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం కనుసన్నల్లో కిరణ్ బేడీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని సీఎం ఆరోపణలు చేశారు. ఈనేపథ్యంలోనే గవర్నర్ ను రీకాల్ చేయాలంటూ గవర్నర్ బంగ్లా ఎదుట ఎమ్మెల్యేలతో కలిసి ఆందోళన సైతం నిర్వహించారు. అయితే కిరణ్ బేడి మాత్రం చట్టాల పరిధిలోనే తాను వ్యవహరిస్తున్నంటూ సీఎం ఆరోపణలు కొట్టిపారేసింది.

గవర్నర్ పరిధిని తేల్చి చెప్పిన మద్రాస్ కోర్టు
కాగా కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లి పరిధిలో అధికారాలు పుదుచ్చేరి గవర్నర్ కు ఉండవని సుప్రిం కోర్టు సైతం గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హై కోర్టు సైతం సుప్రిం కోర్టు తీర్పును ఊటంకిస్తూ ఆర్టికల్ 239ఏఏ మరియు 239ఏబీ ల మధ్య తేడాను స్పష్టం చేసింది. ఢిల్లికి వర్తించినట్టుగా పుదుచ్చేరికి అధికారాలు ఉండవని పుదుచ్చేరికి కేవలం 239ఏ ప్రకారమే అధికారాలు ఉంటాయని తేల్చి చెప్పింది.

ఢిల్లిపై గతంలో సుప్రిం కోర్టు ఏం చెప్పింది
కాగా గత సంవత్సరం ఇదే అంశంపై సుప్రిం కోర్టు ఓ తీర్పును వెలువరించింది. ముఖ్యంగా ఢిల్లి క్యాబినెట్ తీసుకున్న విధాన నిర్ణాయాలను లెఫ్ట్ నెట్ గవర్నర్ తప్పక ఆమోదించడంతో ఎల్జీ కేవలం ఓ కాపాలదారుడుగానే ఉండాలని చెప్పింది. కాగా ఢిల్లి ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం ఉంటుందని పేర్కోంది. మరోవైపు గవర్నర్ కు ఏవైన ఇబ్బందులు ఉంటే రాష్ట్రపతికి పిర్యాధు చేయవచ్చని తెలిపింది. దీంతో లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు ముఖ్యమంత్రి కేజ్రివాల్ మధ్య వార్ కు చెక్ పెట్టింది సుప్రిం కోర్టు .
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications