పంతం నెగ్గించుకున్న విజయ్..! మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు..!

తమిళనాడు సీఎం విజయ్ (Vijay) రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన రెండున్నరేళ్లలో అధికారం సాధించడమే కాదు, అతి తక్కువ కాలంలోనే పాలనలోనూ రాటుదేలారు. ముఖ్యంగా తన మార్కు చూపించే విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదు. తాను అధికారంలోకి రాకముందే తన పార్టీ నిర్వహించిన ర్యాలీలో జరిగిన కరూర్ తొక్కిసలాట (Karur Stampede) విషయంలో విజయ్ తీసుకున్న ఓ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు (Madras High Court) కూడా ఇవాళ సమర్థించింది.

Tamil Nadu: తమిళనాడులో రిజిస్ట్రేషన్లు ఇకపై ఇలా..! విజయ్ కీలక నిర్ణయం..!
Tamil Nadu: తమిళనాడులో రిజిస్ట్రేషన్లు ఇకపై ఇలా..! విజయ్ కీలక నిర్ణయం..!

గతేడాది సెప్టెంబర్ లో కరూర్ లో టీవీకే ర్యాలీ సందర్భంగా భారీగా తొక్కిసలాట జరిగింది. ఇందులో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు ఇప్పటికీ సీఎం విజయ్ ను ఇప్పటికీ వెంటాడుతోంది. అయితే కరూర్ లో చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకునే విషయంలో విజయ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవాళ కరూర్ కు వెళ్లి మృతుల కుటుంబాల్ని విజయ్ పరామర్శిస్తున్నారు. అదే సమయంలో ఆయా కుటుంబాలకు ఒక్కో ఉద్యోగం కల్పించాలని ఆయన నిర్ణయించారు.

Madras High Court relief to Vijay government over jobs to karur victims kin
Vijay: విపక్షాల్ని తుడిచిపెట్టేస్తున్న విజయ్- టీవీకేలోకి భారీగా కీలక నేతల క్యూ..!
Vijay: విపక్షాల్ని తుడిచిపెట్టేస్తున్న విజయ్- టీవీకేలోకి భారీగా కీలక నేతల క్యూ..!

బాధిత కుటుంబాలకు ఈ ఉద్యోగాల నియామక పత్రాలు అందజేయడానికి, మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ కూడా ప్లాన్ చేశారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ నియామకాలు తాత్కాలికమైనవని, న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని కోర్టు పేర్కొంది. ప్రభుత్వ విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోవడం అత్యంత సంకుచితమైనదిగా మధుర బెంచ్ తెలిపింది. ప్రజా విషాదాల బాధితులకు అందించే ఉద్యోగాలకు సంబంధించి ఏకరీతి ప్రభుత్వ విధానం లేకుండా ఇటువంటి నియామకాలు చేయవచ్చా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తామని కూడా ధర్మాసనం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+