చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ స్వాతి మర్డర్ కేసు: రామ్‌కుమార్‌ను వీడియో తీసేందుకు హైకోర్టు అనుమతి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో అరెస్టయిన రామ్ కుమార్‌ను సెంట్రల్ జైలులో ఫోటోలు, వీడియోలు తీసేందుకు మద్రాసు హైకోర్టు అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది.

వివరాల్లోకి వెళితే.... గత జూన్ 24న చెన్నైలోని నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో అందరూ చూస్తుండగా స్వాతిని అత్యంత దారుణంగా కత్తితో హతమార్చిన రామ్ కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత తిరునల్వేలి జిల్లా సెంగోట సమీపంలోని డి.మీనాక్షిపురంలో దాగిన రామ్‌కుమార్‌ చెన్నై పోలీసులు అరెస్టు చేశారు.

ఇంజనీరింగ్ విద్యార్ధి అయిన రామ్ కుమార్ ప్రస్తుతం చెన్నైలోని పుళల్‌ సెంట్రల్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నాడు. ఈ క్రమంలో రామ్‌కుమార్‌ను స్వాతిని ఎలా హత్య చేశాడో నటింపజేసి, ఆ దృశ్యాలను వీడియో తీయడానికి జైలు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

దీనిని వ్యతిరేకిస్తూ రామ్‌కుమార్‌ తరపు న్యాయవాది రామరాజ్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రామ్‌కుమార్‌ను వీడియో తీయడానికి అనుమతించకూడదని ఆయన వాదించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన 14వ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి పీఎన్ ప్రకాష్‌, రామ్‌కుమార్‌ను పోలీసులు వీడియో తీయడానికి అనుమతించారు.

టెక్కీ స్వాతిని హత్య చేసిన తీరును రామ్‌కుమార్‌ నుంగంబాక్కం రైల్వేస్టేషన్ వద్ద నటింపజేయడానికి పోలీసులు ప్రయత్నించకూడదని ఆయన తీర్పులో పేర్కొన్నారు. పుళల్‌ సెంట్రల్‌ జైలులోనే అతడిని నటించమని వీడియో తీస్తేచాలునని న్యాయమూర్తి ఉత్తర్లుల్లో పేర్కొన్నారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని ఎస్‌ఐ ర్యాంకు లేదా ఆపై ఉన్న పోలీసు అధికారులతో మాత్రమే చేయించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను, ఫోరెన్సిక్ నివేదికతో పాటు ఫోరెన్సిక్ నిపుణుల ఓపినియన్‌ను కోర్టుకు తెలియజేయాలని విచారణాధికారిని కోర్టు ఆదేశించింది.

టెక్కీ స్వాతి మర్డర్ కేసు: రామ్‌కుమార్‌ను వీడియో తీసేందుకు హైకోర్టు అనుమతి

టెక్కీ స్వాతి మర్డర్ కేసు: రామ్‌కుమార్‌ను వీడియో తీసేందుకు హైకోర్టు అనుమతి

ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్ కుమార్ తప్పించకోవడానికి వీలు లేకుండా దర్యాప్తు అధికారులు సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. తాము రామ్ కుమార్ గొంతు కోసినట్లు చేస్తున్న ఆరోపణలు కేసును తప్పు దారి పట్టించడానికేనని వారు అభిప్రాయపడుతున్నారు. రామ్ కుమార్ స్వాతిని హత్య చేశాడని చెప్పడానికి తగిన ఆధారాలు ఇప్పటికే తమ వద్ద ఉన్నాయని అంటున్నారు.

 టెక్కీ స్వాతి మర్డర్ కేసు: రామ్‌కుమార్‌ను వీడియో తీసేందుకు హైకోర్టు అనుమతి

టెక్కీ స్వాతి మర్డర్ కేసు: రామ్‌కుమార్‌ను వీడియో తీసేందుకు హైకోర్టు అనుమతి

స్వాతిని రామ్‌కుమార్‌ హత్య చేస్తుండగా చూసిన ప్రత్యక్షసాక్షులు ఉన్నారని, అంతకు ముందు ఆమెను పలుమార్లు వెంబడించాడని చెప్పటానికి కూడా సాక్షులు ఉన్నారని పోలీసులు అంటున్నారు. రామ్‌కుమార్‌ ధరించిన చొక్కాపైని రక్తం స్వాతిదేనని ఫోరెన్సిక్‌ పరీక్ష ద్వారా నిర్ధారణ అయినట్లు వారు చెబుతున్నారు.

 టెక్కీ స్వాతి మర్డర్ కేసు: రామ్‌కుమార్‌ను వీడియో తీసేందుకు హైకోర్టు అనుమతి

టెక్కీ స్వాతి మర్డర్ కేసు: రామ్‌కుమార్‌ను వీడియో తీసేందుకు హైకోర్టు అనుమతి

ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో పుళల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న రామ్‌కుమార్‌ను పోలీసులు పలుమార్లు విచారించారు. కోర్టు ఆదేశాలమేరకు మూడు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపినప్పుడే రామ్‌కుమార్‌ స్వాతిని తానే హత్య చేశానని వాంగ్మూలం ఇచ్చాడని వారంటున్నారు.

టెక్కీ స్వాతి మర్డర్ కేసు: రామ్‌కుమార్‌ను వీడియో తీసేందుకు హైకోర్టు అనుమతి

టెక్కీ స్వాతి మర్డర్ కేసు: రామ్‌కుమార్‌ను వీడియో తీసేందుకు హైకోర్టు అనుమతి

పోలీసులు రామ్‌కుమార్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించినప్పుడు అతడు తన గొంతును బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని, పోలీసులు తన కుమారుడి గొంతును కోశారని న్యాయవాదులతో కలిసి రామ్‌కుమార్‌ తండ్రి పరమశివం ఆరోపించడం పోలీసు వర్గాల్లో అప్పట్లో సంచలనం కలిగించింది.

English summary
The Madras High Court today granted permission to the police for video recording Ramkumar, the accused in the techie Swathi murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X