అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు: సుప్రీం కోర్టుకు కేసు: బదిలి చేసిన హైకోర్టు న్యాయమూర్తి !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ విచారణ సుప్రీం కోర్టుకు చేరింది. మద్రాసు హైకోర్టు న్యాయస్థానం నుంచి పిటిషన్ విచారణ సుప్రీం కోర్టు చేతికి వెళ్లింది. టీటీవీ దినకరన్ గ్రూప్ లోని 18 మంది ఎమ్మెల్యేల మీద తమిళనాడు స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.

తమిళనాడు స్పీకర్ ధనపాల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ టీటీవీ దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి పిటిషన్ విచారణ జరుగుతోంది. గురువారం (నవంబర్ 2వ తేదీ) మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి రవిచంద్రబాబు పిటిషన్ విచారణ చేశారు.

Madras High Court hearing AIADMK MLAs disqualification case today

ప్రభుత్వం, టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేల వాదనలు విన్నారు. అనంతరం రవిచంద్రబాబు సుప్రీం కోర్టుకు పిటిషన్ విచారణ బదిలీ చెయ్యాలని నిర్ణయించారు. సుప్రీం కోర్టులోని ఐదుగురు న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనం టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేల పిటిషన్ విచారణ చెయ్యాలని మనవి చేస్తూ లేఖ రాశారు.

టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేల పిటిషన్ విచారణ సుప్రీం కోర్టు చేతికి వెళ్లింది. ఈ సందర్బంగా టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అతి త్వరలోనే తమిళనాడు ప్రభుత్వం కుప్పకూలిపోతుందని జోస్యం చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Madras High Court today hearing the plea of 18 AIADMK legislators loyal to TTV Dhinakaran against their disqualification from the party. Judge Ravichandra babu request Supreme Court bench of 5 judges to hear assembly case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి