రైలులో వంటగ్యాస్ సిలిండర్లు..బోగీ బుగ్గి: టూర్ ఆపరేటర్‌పై కేసులు
చెన్నై: తమిళనాడులోని మధురై వద్ద సంభవించిన రైలు ప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ ఘటనకు కారణమైన టూర్ ఆపరేటర్‌పై జీపీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రైలులో వంటగ్యాస్ సిలిండర్లను తరలించడమే ఈ ప్రమాదానికి కారణమని తేలిన నేపథ్యంలో వారిపై పలు సెక్షన్ల కింద వారిపై క్రిమినిల్ కేసులను పెట్టారు.
ఈ ఘోర రైలు ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తుండగా మార్గమధ్యలో మధురై వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీర్థయాత్రల కోసం ఓ టూర్ ఆపరేటర్ ఈ బోగీని అద్దెకు తీసుకున్నారు. ప్రయాణ సమయంలో కోచ్‌లో టీ చేసుకోవడం కో్సం సిలిండర్‌ను వెలిగించగా.. అది పేలినట్లు పోలీసులు నిర్ధారించారు.

ప్రమాదంలో రైలు బోగీ పూర్తిగా దగ్ధమైంది. ఘటన సమయంలో రైలులో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 10 మంది మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే భద్రత బలగాలు, రైల్వే సాధారణ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది.
ఈ ఘటనపై జీపీఎఫ్ పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. టూర్ ఆపరేటర్‌పై కేసు నమోదు చేశారు. ఐపీసీ, రైల్వ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు పెట్టినట్లు సదరన్ రైల్వే అధికారులు తెలిపారు. మధురై రైల్వే స్టేషన్ సమీపంలో లూప్ లైన్‌లో ఉంచిన ఈ బోగీని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. పేలుడు సంభవించడానికి గల కారణాలపై అన్వేషణ సాగిస్తోన్నారు.












Click it and Unblock the Notifications