వైరల్ వీడియో: అది రైలా..? లేక కిచెనా..?
దేశంలో నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. రైళ్లలోనే సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. రైలు ప్రయాణాలు సురక్షితమైనవి, చౌకగా ప్రయాణికులు భావిస్తుంటారు. రైలులో కొన్ని జర్నీలు రెండు.. మూడు రోజులపాటు సాగుతాయి. ఇక ప్రయాణికులు ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకోవడం.. లేదా స్టేషన్లలో దొరికింది తినడం చేస్తుంటారు. అయితే తాజాగా ఓ రైలులో మహిళా ప్రయాణికురాలు చేసిన నిర్వాకం చూస్తే అందరూ షాక్ అవుతారు. మహారాష్ట్రకు చెందిన ఆ మహిళ.. ఏకంగా రైలు బోగీలోనే వంట చేసింది. రైలు బోగీలోని ఛార్జింగ్ పాయింట్ కు ప్లగ్ పెట్టి ఎలక్ట్రానిక్ కెటిల్ లో మ్యాగీ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. రైల్వేశాఖ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది.

రైలులో ఎలక్ట్రిక్ కెటిల్ వినియోగం నిషేధం. కానీ మహారాష్ట్రకు చెందిన మహిళ.. రైలు బోగిలోనే ఎలక్ట్రిక్ కెటిల్ లో వంట చేసింది. కెటిల్ ప్లగ్ ను రైలు బోగీలో ఉండే స్విచ్ బోర్డులో పెట్టి.. మ్యాగీ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే ఈ ఘటనపై రైల్వే శాఖ సీరియస్ అయింది. ఇలా చేయడం సేఫ్ కాదని.. చట్టరిత్యా నేరం, శిక్షించదగిన నేరం అని రైల్వే శాఖ ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. మహిళపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులు రైళ్లలో ఇలాంటి ఘటనలకు పాల్పడొద్దని స్పష్టం చేసింది. ఇలాంటివి రైలులో జరిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపింది. ప్రయాణికుల భద్రతే తమ ప్రథమ కర్తవ్యం అని రైల్వేశాఖ పేర్కొంది. ఇదే ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Action is being initiated against the channel and the person concerned.
— Central Railway (@Central_Railway) November 21, 2025
Using electronic kettle inside trains is strictly prohibited.
It is unsafe, illegal, and a punishable offence. It can lead to fire incidence and be disastrous for other passengers also.
May also cause… https://t.co/di9vkxrDLv
ఏసీ కంపార్ట్ మెంట్ లో ప్రయాణం చేస్తున్న ఆ మహిళ.. కొంచెం కూడా భయం లేకుండా అలా సరదాగా నవ్వుతూ మ్యాగీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జర్నీలో హాట్ హాట్ మ్యాగీ చేసుకుని తినడం ఎవరికైనా ఇష్టమే ఉంటుంది. కానీ రైలులో ఇలాంటి పనులు చాలా ప్రమాదకరమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కరెంట్ ఓవర్ లోడ్ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి రైలు ప్రమాదం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రైలులోని వందల మంది ప్రాణాలను ఫణంగా పట్టినట్టేనని నెటిజన్లు మండిపడుతున్నారు. రాను రాను పబ్లిక్ పరిజ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications