రూ. 320 కోట్ల మ్యాగీ నూడుల్స్ బూడిద
న్యూఢిల్లీ: నెస్లె ఇండియా కంపెనీ తయారు చేసిన రూ. 320 కోట్ల విలువైన 27,420 టన్నుల మ్యాగీ నూడుల్స్ బూడిద చెయ్యడానికి రంగం సిద్దం అయ్యింది. స్వయంగా ఆ కంపెనీ ప్రతినిధులు ఈ విషయం వెల్లడించారు. మ్యాగీ నూడుల్స్ నిషేదించడంతో నెస్లె ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
మార్కెట్ లు, వ్యాపార భాగస్వాముల దగ్గర రూ. 210 కోట్ల విలువైన స్టాక్ ఉందని, ఫ్యాక్టరీలు, గోదాములలో రూ. 110 కోట్ల విలువైన నిల్వలు ఉన్నాయని బాంబే స్టాక్ ఎక్ట్సేంజ్ కు సమాచారం ఇచ్చింది. మార్కెట్, ఫ్యాక్టరీలలోని నిల్వలను ఉపసంహరించుకుంటున్నామని వెల్లడించారు.

మ్యాగీ నూడుల్స్ లో సీసం, మోనోసోడియం గ్లుటామేట్ స్థాయిలు పరిమితి కంటే ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన భారత ఆహార భద్రతా ప్రమాణ సంస్థ మ్యాగీ నూడుల్స్ ను నిషేదించింది. ఈనెల 5వ తేదిన మ్యాగీ నూడుల్స్ ను నిషేధిస్తున్నామని ఆదేశాలు జారీ చేసింది.
అదే సమయంలో మ్యాగీ నూడుల్స్ ను మార్కెట్ ల నుండి వెనక్కి తీసుకుంటున్నామని నెస్లె ఇండియా ప్రకటించింది. మ్యాగీ నూడుల్స్ నిషేదంపై స్టే ఇవ్వాలని నెస్లె ఇండియా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అయితే స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఈ సందర్బంలో కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలలో మ్యాగీ నూడుల్స్ ను బూడిదచెయ్యడానికి నెస్లె ఇండియా సిద్దం అయ్యింది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications