సీఎం ఫడ్నవీస్ భార్యకి గాల్లోంచి నెక్లెస్ తీసిచ్చిన బాబా

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఓ బాబా నుంచి నెక్‌లెస్ తీసుకోవడం వివాదానికి తెర లేపింది. సదరు బాబా ఆ నెక్‌లెస్‌ను గాలిలోంచి తీసి ఇచ్చారు. దీంతో దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి.

కొందరు బాబాలు గాలిలో నుంచి వస్తువులను సృష్టించడం మనం వింటోందే. దీనిపై హేతువుతులు విమర్శలు చేస్తుంటారు. వాటిని నమ్మడం సరికాదని విద్యావంతులు కూడా చెబుతుంటారు. ఇప్పుడు ఆ బాబా గాల్లోంచి తీసి ఇచ్చిన నెక్‌లెస్ ఫడ్నవీస్ భార్యను చిక్కుల్లో పడేసింది.

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ భార్య అమృత ఓ స్వామీజీ వద్దకు వెళ్లారు. ఆయన గాల్లోంచి ఓ బంగారు గొలుసును సృష్టించి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఆ దృశ్యాలు వీడియోకు చిక్కి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.

Magic chain by godman lands Devendra Fadnavis' wife in row

పుణెలోని ఓ విద్యా సంస్థలో జరిగిన అవార్డుల బహుకరణ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ గురువానంద్ స్వామి పాల్గొనగా.. ఈ ఘటన జరిగింది. ఆయనిచ్చిన బంగారు నక్లెస్‌ను అమృత స్వీకరించడం, ఆపై పాదాలకు అభివందనం చేయడం ఈ దృశ్యాల్లో కనిపించగా, విమర్శలు వస్తున్నాయి.

ముఖ్యమంత్రి ఈ విషయమై వివరణ ఇవ్వాలని, ఆయన క్షమాపణలు చెప్పాలని మహారాష్ట్రలో మంత్రశక్తులకు వ్యతిరేకంగా పని చేస్తున్న కమిటీ అధ్యక్షుడు అవినాష్ పటేల్ డిమాండ్ చేశారు. ఆయన మరోసారి ఇదే విధంగా తమ ముందు చేసి చూపి మరో బంగారు గొలుసును తీస్తే రూ.21 లక్షల బహుమతి ఇస్తామన్నారు.

దీనిపై స్పందించిన అమృత.. తనకు అలాంటి మహిమలపై నమ్మకం లేదని, ఓ పెద్దాయినకు గౌరవం ఇవ్వాలనే గొలుసును స్వీకరించానని, తనకు మాయమంత్రాలపై నమ్మకంలేదని, తాను నమస్కరించడానికి వెళ్లేటప్పటికే బాబా చేతిలో నగ ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+