గొర్రెలు, మేకలు సింహాన్ని ఏం చెయ్యలేవు!!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి మూకుమ్మడిగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జతకట్టడం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గొర్రెలు, మేకలు సింహం లాంటి ప్రధాని నరేంద్ర మోడీని ఏమి చేయలేవని ఆయన పేర్కొన్నారు.

ప్రతిపక్షాల గుంపును రాబందుల గుంపు అని తాను పిలవనని, వారంతా మేకలు, గొర్రెలు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మేకలు. గొర్రెలు ఎన్ని వచ్చినా అడవిలో సింహం లాంటి ప్రధానిని ఏమి చేయలేవని ఏక్ నాథ్ షిండే పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అన్నీ ఏకమై ప్రధాని నరేంద్ర మోడీని ఓడిద్దామని భావిస్తున్నారని అది కేవలం వారి మనసులో ఉన్న ఆలోచన తప్ప సాధ్యమయ్యేది కాదని ఏకనాథ్ షిండే పేర్కొన్నారు.

maha cm eknath shinde comments; india alliance never reach pm modi in lok sabha elections

వారు ఎక్కడా ఆయన దరిదాపుల్లో కూడా లేరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలు కనీసం ప్రధాన నరేంద్ర మోడీకి పోటీ ఇస్తారని కూడా అనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 80 మంది పార్లమెంటు సభ్యులను లోక్సభకు పంపించనుండగా, మహారాష్ట్ర 48 మంది సభ్యులను లోక్సభకు పంపిస్తుందని మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ లెక్కల్ని బట్టి ప్రతిపక్షాలు ఏవి తమకు దరిదాపుగా కూడా లేవని, ప్రతిపక్షాలు అన్ని కట్టకట్టుకుని వచ్చినప్పటికీ ప్రధాన నరేంద్ర మోడీని ఏమి చేయలేవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే అజిత్ పవార్ తమతో కలిసిన తర్వాత ఎన్సీపీ కూటమి బలం 215 కు పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో కూడా మా ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

పని చేసే నాయకులు కావాలని కోరుకుంటారో లేక ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చుని నేతలు కావాలని కోరుకుంటారో ప్రజలు వారి చేతుల్లోనే ఉందని ఏకనాథ్ షిండే అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తంగా రానున్న లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీని ఎవరు ఏమి చేయలేరు అంటూ, మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమినే అంటూ ఏకనాథ్ షిండే పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+