Maha Kumbh: కుంభమేళా భక్తులకు వసంత పంచమి, శివరాత్రి టెన్షన్..!
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో మౌనీ అమావాస్య సందర్బంగా జరిగిన తొక్కిసలాట భక్తుల్లో తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి జరిగిన ఈ తొక్కిసలాటలో 30 మంది భక్తులు చనిపోయారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కుంభమేళాకు వచ్చే భక్తుల్లో మరో రెండు అమృత స్నాన దినాలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈ రెండు రోజుల్లో కుంభమేళాకు రావడంపై వారు పునరాలోచించుకోవాల్సిన పరిస్ధితి.
కుంభమేళాలో ఈసారి ఏర్పాట్లు బాగుతున్నాయని అనుకునేలోపే మౌనీ అమావాస్య రోజు తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా చనిపోయారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా భారీ ఏర్పాట్లు చేశామని చెప్పుకుంటున్నా క్షేత్రస్దాయిలో భిన్న పరిస్ధితులు కనిపిస్తున్నాయని అక్కడికి వెళ్లి వచ్చిన భక్తులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మౌనీ అమావాస్య తొక్కిసలాట భక్తుల్లో ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా మూడో అమృత స్నాన దినమైన వసంత పంచమితో పాటు శివరాత్రి కూడా భక్తుల్లో టెన్షన్ రేపుతున్నాయి.

ఇప్పటికే మకర సంక్రాంతి సందర్భంగా తొలి అమృతస్నానం పూర్తి కాగా.. మౌనీ అమావాస్య రోజు రెండో అమృత స్నానం జరిగిందది. అలాగే ఫిబ్రవరి 3న వసంత పంచమి సందర్భంగా మూడో అమృతస్నానం, శివరాత్రి సందర్భంగా నాలుగో అమృత స్నానం జరగాల్సి ఉన్నాయి. వీటితో కుంభమేళా ముగియనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు అమృత స్నానాల రోజు హాజరయ్యే భక్తుల్లో టెన్షన్ నెలకొంది. అయితే ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ సర్కార్ మాత్రం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతోంది. మౌనీ అమావాస్య రోజు అనుభవాలతో వీటికి మరింత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతోంది.












Click it and Unblock the Notifications