మహా కుంభమేళా: ‘కమల’గా పేరు మార్చుకున్న స్టీవ్ జాబ్స్ సతిమణి లారీన్ పావెల్

సాఫ్ట్‌వేర్ దిగ్గజం యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్ తన పేరును మార్చుకున్నారు. మహాకుంభ మేళాలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరానికి చేరుకున్న లారీన్ పావెల్ తన పేరును 'కమల'గా మార్చుకున్నారు. నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహరాజ్‌.. లారీన్ పావెల్ జాబ్స్‌కు కమల అని నామకరణం చేశారు.

లారీన్‌కు 'కమల' అని గత శుక్రవారం రోజే (జనవరి 10న) నామకరణం చేశామని కైలాసానంద గిరి మహరాజ్‌ తెలిపారు. ఆమె తనకు కూతురు లాంటిదని ఆయన అన్నారు. లారీన్ పావెల్ జాబ్స్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి అని చెప్పారు. వచ్చిన ప్రతీసారి ఆమె హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.

Maha Kumbh Mela Steve Jobs wife Laurene Powell changes her name to Kamala

మెడిటేషన్ చేసేందుకు ఆమె తమ ఆశ్రమానికి వచ్చి వెళ్తుంటారని వెల్లడించారు. జనవరి 29వ తేదీ వరకు స్వామి కైలాసానంద గిరి మహరాజ్‌కు చెందిన ఆశ్రమంలోనే ఉంటూ మహాకుంభ మేళాకు సంబంధించిన వివిధ పూజా కార్యక్రమాల్లో కమల పాల్గొంటారని సమాచారం. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా కొనసాగనుంది.

కాగా, భారత్‌కు చేరుకున్న వెంటనే కమల (లారీన్ పావెల్ జాబ్స్) ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి వెళ్లారు. అక్కడ ఆమె మీడియాతో మాట్డుతూ.. 'మహాకుంభ మేళా ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని మహాదేవుణ్ని పూజించాను. విశ్వనాథుడిని కుంభమేళాకు ఆహ్వానించేందుకు నేను కాశీకి వచ్చాను' అని తెలిపారు.

లారీన్ పావల్ జాబ్స్‌కు అస్వస్థత

మహా కుంభమేళాకు హాజరైన లారీన్ పావెల్‌ అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు గురైనట్లు నిరంజనీ అఖాండాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహారాజ్ తెలిపారు. ప్రస్తుతం లారీన్ తాము ఏర్పాటు చేసిన శిబిరంలో చికిత్స తీసుకొంటున్నారని, ఆరోగ్యం కుదుటపడ్డాక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+