Mahakumbh Mela 2025: అరుదైన ఘట్టం- కొత్త చరిత్ర..!!

Mahakumbh Mela 2025: మహాకుంభ మేళా కొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఇప్పటికే దాదాపు 12 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పాల్గొన్నారు. విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. యూపీ ప్రభుత్వం నిత్యం కుంభమేళాలో భక్తుల అవసరాల పైన సమీక్ష చేస్తోంది. రాష్ట్రపతి, ప్రధాని మోదీ కుంభమేళాకు రానున్నారు. ఇదే సమయంలో 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కుంభమేళాలో పుణ్య స్నానాల కోసం తరలి వస్తున్నారు.

ప్రయాగ్ రాజ్ లో ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సంగమం కొనసాగుతోంది. త్రివేణీ సంగమం వద్ద కోట్లాది భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. దేశ విదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాగ్ రాజ్ కు తరలి వస్తున్నారు. ఇదే క్రమంలో 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్‌ రాజ్‌ కు రానున్నట్లు అధికారులు వెల్లడించారు. హిందూ సంప్రదాయంలో జరుగుతున్న మహాకుంభ్ లో
రష్యా,ఉక్రెయిన్‌ సహా అమెరికా, జపాన్‌, జర్మనీ,నెదర్లాండ్‌, కామెరూన్‌, కెనడా, స్విట్జర్లాండ్‌, స్వీడన్‌, పోలాండ్‌, బొలీవీయా ఇలా 73 దేశాల దౌత్యవేత్తలు పుణ్య స్నానాల కోసం తరలి వస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.

Mahakumbh 2025 Diplomats from 73 countries are coming to take a holy dip in Prayagraj

విదేశీ దౌత్యవేత్తలు ఫిబ్రవరి 1న త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శికి విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి సమా చారం ఇచ్చారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రయాగ్ రాజ్ లో దౌత్యవేత్తల పుణ్య స్నానాల తరువాత అక్షయావత్‌,బడేహనూమాన్‌ ఆలయాన్నిసందర్శిస్తారు. ఇందు కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కాగా, మహాకుంభ్ లో మరోసారి స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కుంభమేళా కొనసాగనుంది. వచ్చే వారం నుంచి ప్రముఖుల రాక పెరగనుండటంతో ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+