మహారాజా ఎక్స్‌ప్రెస్ – రైలు కాదు, రాజమహల్.. టికెట్ లక్షల్లోనే!

భారతీయ రైల్వేలు నడిపే ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన రైళ్లలో మహారాజా ఎక్స్‌ప్రెస్ ఒకటి. అచ్చం రాజ కుటుంబీకుల జీవన శైలిని గుర్తుచేసే ఈ రైలు భారతదేశం యొక్క సాంస్కృతిక వైభవాన్ని అందిస్తూ భారతదేశంలో పర్యటనకు వచ్చే అతిధులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. రైలు లోపలికి వెళితే ఒక రాజ మహల్ ని చూసినట్టే ఉంటుంది.

రాజమహల్ ను తలపించే రైలు
ధగధగా మెరిసిపోయే ఫర్నిచర్, బంగారు వర్ణంతో ఉన్న అలంకరణలు, సాఫ్ట్ లైటింగ్, ఒకప్పటి రాజుల కాలం నాటి మహల్ ను తలపింపజేస్తాయి. ప్రతి గది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విలాసవంతమైన సదుపాయాలతో రైలు క్యాబిన్లు ఉంటాయి. మహారాజ ఎక్స్ప్రెస్ లో డీలక్స్ క్యాబిన్లు, జూనియర్ సూట్ లు, సూట్లు, ప్రెసిడెన్షియల్ సూట్ వరకు విభిన్న వర్గాలకు కావలసిన గదులు ఉంటాయి.

Maharaja Express Not a train but a palace Tickets cost lakhs

Take a Poll

విలాసవంతమైన సౌకర్యాల రైలు
ప్రతి గదిలోను ఎయిర్ కండిషనింగ్, ప్రైవేట్ బాత్రూం, వైఫై, టెలివిజన్, 24 గంటల అటెండెంట్ వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి. అంతేకాదు మయూర్ మహల్, రంగ్ మహల్ పేరుతో రెండు రెస్టారెంట్లు ఇందులో ప్రయాణం చేసే వారి మనసులను దోచుకుంటాయి. ప్రత్యేకంగా రూపొందించిన బార్ మరియు లాంజ్ చాలా విలాసవంతంగా కనిపిస్తుంది.

రైలు ప్రయాణం కాదు.. సాంస్కృతిక యాత్ర
మహారాజ ఎక్స్ప్రెస్ కేవలం రైలు ప్రయాణం మాత్రమే కాదు, అది ఒక సాంస్కృతిక యాత్ర.హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ట్రెజర్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ స్ప్లెండర్, ఇండియన్ పానోరమ వంటి విభిన్న టూర్ ల ద్వారా ప్రయాణికులు రాజస్థాన్, ఢిల్లీ, ఆగ్రా, ఖజురహో, వారణాసి, ముంబై వంటి చారిత్రక నగరాలను చూసే అవకాశం కలుగుతుంది. ప్రతి స్టేషన్లలోనూ గైడ్ లతో కూడిన పర్యటనలు, సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేస్తాయి.

రైల్లో ప్రయాణం చెయ్యాలంటే లక్షల్లోనే
ఈ రైలులో ప్రయాణం చేయాలంటే ఒక్క వ్యక్తికి 4లక్షల రూపాయల నుండి 19 లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుంది. కానీ ఈ అనుభవం మాత్రం జీవితంలో ఒక్కసారైనా పొందాల్సిందే అన్న అభిప్రాయం ఈ రైలులో ప్రయాణం చేసిన వారికి కలుగుతుంది. వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ లో అనేకమార్లు మహారాజ ఎక్స్ప్రెస్ అవార్డును అందుకుంది. ప్రపంచ పర్యాటకుల దృష్టిలో ఇది రాజమహల్ ను తలపించే రైలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+