ఘోర ప్రమాదం: బస్సు-కంటైనర్ ఢీ, 20మంది మృతి
ముంబై: మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న మహారాష్ట్ర ఆర్టీసికి చెందిన బస్సు, ఎదురుగా వస్తున్న కంటైనర్ ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. ధూలే- చాలిస్గావ్ మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ధూలే, చలిస్గావ్‌లలోని ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications