MH Elections: రాహుల్ కు హర్యానా నేర్పిన పాఠం - కీలక నిర్ణయం..!!

మహారాష్ట్ర ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఏ క్షణమైనా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ మేరకు తుది కసరత్తు జరుగుతోంది. అటు పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఫలితాలతో మహారాష్ట్ర ఎన్నికల వేళ బీజేపీలో జోష్ పెరిగింది. హర్యానాలో అధికారం అందినట్లే అంది చే జారటంతో రాహుల్ గాంధీ అలర్ట్ అయ్యారు. మహారాష్ట్రలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ నేతలతో నేడు కీలక భేటీ ఏర్పాటు చేసారు. కూటమితో కలిసి ఎన్నికల కోసం దిశా నిర్దేశం చేస్తున్నారు.

హార్యానా ఫలితంతో
మహారాష్ట్ర ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోల్ తో పాటుగా విజయ్ వాడెట్టివార్, చౌహాన్, బాలా సాహెబ్ థోరట్, వర్షా గైక్వాడ్, రమేశ్ చెన్నితల ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న మహా వికాస్ అఘాడిలో మిత్రపక్షాలు ఈ సారి తమకు ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. సీఎం ఎవరనేది తరువాత నిర్ణయించినా..తమ బలానికి అనుగుణంగా సీట్ల కేటాయింపు జరగాలని ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో, రాహల్ గాందీ ఈ సమావేశంలో భాగస్వామ్య పక్షాలతో సమన్వయం.. సీట్ల సర్దుబాటు..ప్రచారం పైన ప్రధానంగా సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది.

Maharashtra Assembly Elections Rahul Gandhi To meet Congress leaders

బీజేపీ కూటమి లక్ష్యంగా
హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక ప్రధానంగా పార్టీలోని ముఖ్య నేతల మధ్య విభేదాలు.. సమన్వయం లేకపోవటమే ప్రధానమని గుర్తించిన రాహుల్ మహారాష్ట్రలో అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు ప్రారంభించారు. కూటమిలోని మూడు పార్టీల నుంచి ఎన్నికల సమన్వయానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇటు బీజేపీ కూటమిని ఫిక్స్ చేయటానికి ముఖ్యమంత్రి ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది.

దీని పైన ఉధ్దవ్ థాక్రే స్పందించారు. అధికారంలో ఉన్న కూటమి తమ సీఎం ఎవరో చెబితే.. తమ నుంచి ఎవరో సీఎం అభ్యర్ధి తాము ప్రకటిస్తామని కౌంటర్ ఇచ్చారు. అధికార కూటమిని లక్ష్యంగా చేసుకొని అనేక ఆరోపణలు చేసారు. ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఇక, ఇప్పుడు రాహుల్ సమావేశం తరువాత కాంగ్రెస్ సైతం తమ కార్యాచరణ వేగవంతం చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+