మంత్రివర్గ విస్తరణ ఈ సాయంత్రమే: లేట్ అయినా లేటెస్ట్‌గా- లిస్ట్ ఇదే..!!
Maharashtra Cabinet expansion: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల తరువాత- మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. నాగ్‌పూర్ వేదికగా ఈ సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
మహారాష్ట్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 43 మంది మంత్రులకు చోటు లభిస్తుంది. ముఖ్యమంత్రితో కలుపుకొని బీజేపీకి 21 మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. మిగిలిన వాటిని మహాయుటి మిత్ర పార్టీలు శివసేన, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గానికి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి దక్కొచ్చు.

ఇందులో ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన- 12, ఎన్సీపీ (అజిత్ పవార్)కి 10 బెర్తులు కేటాయించారనే ప్రచారం జరుగుతోంది. శివసేకు హోమ్ మంత్రిత్వ శాఖ ఇవ్వట్లేదని సమాచారం. అలాగే- కీలకమైన రెవెన్యూ మంత్రిత్వ శాఖను కూడా కేటాయించే అవకాశం లేదని చెబుతున్నారు. దీనికి బదులుగా మున్సిపల్ శాఖను ఇస్తారని తెలుస్తోంది.
ఈ నెల 5వ తేదీన మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పటి నుంచి మంత్రివర్గ కూర్పుపై ఎడతెగని కసరత్తు సాగుతూనే వచ్చింది. ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారిలో బీజేపీ నుంచి చంద్రశేఖర్ బవాన్‌కులే- కమ్టీ, సుధీర్ ముంగంటివర్- బల్లార్‌పూర్, రాధాకృష్ణ వీఖే పాటిల్- షిర్డీ, గిరీష్ మహాజన్- జామ్నెర్, చంద్రకాంత్ పాటిల్- కొథ్రుడ్, మంగళ్ ప్రభాత్ లోధా- మలబార్ హిల్, పంకజా ముండే- ఎమ్మెల్సీ, ఆశిష్ షెలార్- బాంద్రా వెస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది.
రవీంద్ర చవాన్- డోంబివలి, అతుల్ సవే- ఔరంగాబాద్ ఈస్ట్, అశోక్ ఉయికే- రాలెగావ్, జై కుమార్ రావల్- సింద్‌ఖేడ్, పరిణయ్ ఫుకే- ఎమ్మెల్సీ, సంజయ్ కోటే- జల్‌గావ్, శివేంద్ర రాజే భోసలే- సతారా, నితేష్ రాణే- కంకావలి పేర్లు కొత్త మంత్రుల జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు.
శివసేన నుంచి ఉదయ్ సామంత్- రత్నగిరి, శంభూ రాజె దేశాయ్- పాటన్, దాదా భుసె- మాలెగావ్ అవుటర్, గులాబ్ రావ్ పాటిల్- జల్‌గావ్ రూరల్, సంజయ్ శిర్సత్- ఔరంగాబాద్ వెస్ట్, భరత్ గొగావలె- మహద్, ప్రకాశ్ అబిత్కర్- రాధానగరికి చోటు దక్కొచ్చు.
ఎన్సీపీ నుంచి ఛగన్ భుజ్‌బల్- యెవ్లా, ఆదితి తత్కరె- రాయ్‌గఢ్, అనిల్ పాటిల్- అమల్నెర్, సంజయ్ బన్సొడె- ఉద్గిర్, మకరంద్ జాదవ్ పాటిల్- వయ్, నరహరి ఝిర్వాల్- ఇగత్‌పురి ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications