మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను చంపుతామంటూ బెదిరింపులు: దసరా ర్యాలీ, భద్రత కట్టుదిట్టం

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను చంపుతామంటూ బెదిరంపులు రావడంతో ఆయనకు భద్రత పెంచినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ కమిషనర్ అశుతోష్ డంబ్రే ఆదివారం తెలిపారు. దుండగులు షిండేను ఆత్మాహుతి పేలుడులో చంపేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

హోం పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సీఎం షిండే భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పదేపదే బెదిరింపుల నేపథ్యంలో ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ముంబై పోలీస్ కమిషనర్, కమిషనర్ ఇంటెలిజెన్స్‌ను ఆదేశించారు.

 Maharashtra CM Eknath Shinde Gets Death Threat Ahead Of Dussehra Rally, security beefed

కాగా, ఇలాంటి బెదిరింపులను తాను పట్టించుకోనని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఇలాంటి బెదిరింపులపై స్పందించేందుకు ముంబై పోలీసులు, డిప్యూటీ సీఎం సమర్థులని ఆయన వ్యాఖ్యానించారు.

షిండేకు భద్రత పెంపు

ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ముఖ్యమంత్రికి అదనపు భద్రత కల్పించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. షిండే అధికారిక నివాసం 'వర్ష', థానేలోని ఆయన వ్యక్తిగత నివాసం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఉద్ధవ్ థాక్రే.. శివసేనతో విడిపోయిన తర్వాత అక్టోబర్ 5న ముంబైలోని ఎంఎంఆర్డీఏ గ్రౌండ్స్‌లో సీఎం షిండే మొదటి దసరా ర్యాలీకి ముందు ఈ బెదిరింపులు రావడం గమనార్హం. మరోవైపు, దాదర్‌లోని శివాజీ పార్క్ వద్ద ఉద్ధవ్ థాక్రే దసరా ర్యాలీని నిర్వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+