Ratan Tata: అసాధారణ వ్యక్తిత్వం - దాతృత్వానికి మరో రూపం..!!

రతన్ టాటా. ఈ పేరే ఒక స్పూర్తి దాయకం. ఒక అసాధారణ మానవాతా వాది. దేశమే ముఖ్యమని నమ్మిన వ్యాపార వేత్త. అత్యున్నతమైన వ్యక్తిత్వం కలిగిన రతన్ టాటా తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో ముంబై బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో కన్నుమూసిన రతన్ టాటా అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే ప్రకటించారు.

https://www.oneindia.com/elections-common/index.php

అసాధారణ వ్యక్తిత్వం
రతన్ టాటా వ్యాపారం..సేవా రంగంలోనూ ముద్ర వేసిన అసాధారణ వ్యక్తి. వ్యాపార వేత్తగానే కాదు.. సిసలైన మానవాతా వాదిగా నిలిచారు. రతన్ టాటా మరణం పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా అనేక రంగాల ప్రముఖలు సంతాపం ప్రకటించారు. మహారాష్ట్రలో అధికారిక కార్యక్రమాలను రద్దు చేసారు. టాటా గ్రూపును 10 వేల కోట్ల డాలర్ల సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన ఘనత రతన్ టాటా సొంతం. వ్యాపారం విస్తరింపజేసిన సమర్థ వ్యాపారవేత్త.. దాతృత్వంలో మేటిగా రతన్ టాటా నిలిచారు. బారత ఆటోమొబైల్‌ సంస్థలకు కార్లు తయారు చేసే సత్తా లేదన్న అపప్రథకు 'ఇండికా' కారు తయారీతో అడ్డుకట్ట వేసారు.

Maharashtra CM Eknath Shinde says Ratan Tata will be accorded a state funeral

లక్ష రూపాయల కారుతో
నష్టాల్లో ఉన్న బ్రిటన్‌ కంపెనీలు జాగ్వార్‌, లాండ్‌రోవర్‌లను కొని లాభాలబాటలోకి నడిపించిన నాయకుడు రతన్ టాటా. రూ లక్ష కే నానో కారును అందుబాటులోకి తెచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా నిలిచిన ఓ మహనీయుడిని మన దేశం కోల్పోయింది. సూది నుంచి విమానం దాకా ఆకాశమే హద్దుగా విస్తరించిన వాణిజ్య విశ్వరూపం రతన్ టాటా. సంపదను సృష్టిస్తూనే... ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవలో తరించిన ఆ జీవితంలో చివరి అధ్యాయం ముగిసింది. ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా కు ప్రముఖులు..అన్ని రంగాల దిగ్గజాలు నివాళి అర్పిస్తున్నారు.

దాతృత్వ కార్యక్రమాల కోసం
వంటగదిలో వాడే ఉప్పు నుంచి.. ఆకాశంలో ఎగిరే విమానాల దాకా.. ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్యజీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాలపాటు రతన్ టాటా నడిపించారు. రక్తపోటు స్థాయులు అకస్మాత్తుగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన రతన్‌ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి.. బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అమెరికాలో పట్టభద్రుడైన అనంతరం.. 1961లో ఆయన టాటా గ్రూపులో చేరారు. తొలుత టాటా స్టీల్‌లో చిరుద్యోగిగా చేరిన ఆయన గ్రూపులోని వివిధ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. 1981లో టాటా ఇండస్ట్రీస్‌ చైర్మన్‌గా.. ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విద్యార్థిలాగా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవారు. తన ఆదాయంలో 60 నుంచి 65 శాతం మేర వివిధ దాతృత్వ కార్యక్రమాలకు కోసం ఉదారంగా ఇచ్చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌తో, 2008లో పద్మవిభూషణ్‌తో గౌరవించింది. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను, గౌరవ డాక్టరేట్లను రతన్‌ టాటా అందుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+