ఇకపై ఒకటో తరగతి నుంచే మిలిటరీ ట్రైనింగ్...
నేటి బాలలే రేపటి పౌరులు.. అందుకే చిన్నప్పటి నుంచే వారిని సిద్దం చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యావ్యవస్థలో సైతం కీలక మార్పు చేసేందుకు సన్నద్ధం అవుతోంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై ఒకటో తరగతి నుంచే విద్యార్థులకు ప్రాథమిక సైనిక శిక్షణ (బేసిక్ మిలిటరీ ట్రైనింగ్) ఇవ్వాలని సంకల్పించింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం వంటి లక్షణాలను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే స్వయంగా వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ...
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టడం పలువురు ఉగ్రవాదులను సైతం మట్టుబెట్టడం జరిగింది. అందుకే భవిష్యత్తులో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సైనిక శిక్షణ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు మంత్రి భూసే స్పష్టం చేశారు. అలానే ఈ విషయం పట్ల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి క్రీడా ఉపాధ్యాయులు, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో పాటు సుమారు 2.5 లక్షల మంది రిటైర్డ్ సైనికుల సహాయ సహకారాలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. చిన్నప్పటి నుంచే విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై వారికి అవగాహన కలుగుతుందని వివరించారు. అంతే కాకుండా ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మాజీ సైనికులతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో దేశం పట్ల ప్రేమ, గౌరవం మరింత పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక ఇప్పటికే భారత్ - పాక్ యుద్ద వాతావరణం నెలకొన్న తరుణంలో దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. భూకంపాలు, అగ్నిప్రమాదాలు, వరదలు, ఉగ్రదాడులు వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications